News February 23, 2025
NGKL: నేడే గురుకుల విద్యాలయాలకు ప్రవేశ పరీక్ష

గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు నేడు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 62 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. హాల్‌టికెట్లతో పాటు బ్లాక్, బ్లూ పెన్నులు, ఆధార్‌కార్డు, పాస్‌ఫొటోలతో రావాలని సూచించారు. ఉ. 11 గం. నుంచి మ.1 గంట వరకు జరిగే పరీక్షకు ఉ.9 గం.లకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News February 23, 2025
పవన్ అధ్యక్షతన జనసేన శాసనసభ పక్ష సమావేశం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రేపటి నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.
News February 23, 2025
కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచులు అందుకున్న క్రికెటర్‌గా కోహ్లీ(158) రికార్డు సృష్టించారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు అందుకుని ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్(156)ను విరాట్ అధిగమించారు. ఓవరాల్‌గా అత్యధిక క్యాచ్‌ల జాబితాలో జయవర్దనే(218), రికీ పాంటింగ్(160) తర్వాత మూడో స్థానంలో నిలిచారు.
News February 23, 2025
కుల్దీప్ 300.. హార్దిక్ 200

టీమ్ ఇండియా ప్లేయర్లు కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త మైలురాయిని చేరుకున్నారు. మూడు ఫార్మాట్లలో కలిపి కుల్దీప్ 300, పాండ్య 200 వికెట్లు తీశారు. కుల్దీప్ వన్డేల్లో 176, టీ20ల్లో 69, టెస్టుల్లో 56 వికెట్లు తీయగా పాండ్య టీ20ల్లో 94, వన్డేల్లో 89, టెస్టుల్లో 17 వికెట్లు తీశారు. ప్రస్తుతం టీ20ల్లో ఆల్‌రౌండర్ల జాబితాలో పాండ్య నం.1 ర్యాంకులో కొనసాగుతున్నారు.