News April 6, 2025

NGKL: పండగను ప్రజలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి: SP

image

NGKL జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ శ్రీరామనవమి పండగను ప్రజలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు పండగల ప్రాధాన్యతను గుర్తించుకోవాలని సూచించారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం విశిష్ట లక్షణమని తెలిపారు. ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ అభివృద్ధివైపు అడుగులు వేయాలని సూచించారు.

Similar News

News April 9, 2025

నల్గొండ జిల్లాలో CONGRESS VS BRS

image

నల్గొండ జిల్లాల్లో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు BRSనేతలు KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRSనేతలకు కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?

News April 9, 2025

అక్కాచెల్లెళ్లతో పెళ్లికి సిద్ధమైన యువకుడు.. షాకిచ్చిన పోలీసులు

image

AP: శ్రీసత్యసాయి జిల్లాలో అక్కాచెల్లెళ్ల(మైనర్లు)తో ఈ నెల 10న పెళ్లికి సిద్ధమైన యువకుడికి పోలీసులు, ICDS అధికారులు షాకిచ్చారు. అతనితోపాటు ఇరు కుటుంబాలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మాట వినకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించడంతో వివాహాన్ని నిలుపుదల చేశారు. ఇద్దరు యువతులతో పెళ్లికి సంబంధించిన వివాహ పత్రిక 3 రోజులుగా సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే.

News April 9, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో BJP పాగా వేసేనా?

image

దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ తెలంగాణపై గురి పెట్టింది. ఈ క్రమంలో ఇటీవల ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నెల్లూరి కోటేశ్వరరావు, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించింది. స్థానిక సంస్థలు, శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా వారు దూకుడు పెంచారు. ఇటీవల ఎంపీ ఎన్నికల్లోనూ గతంలో కంటే మెరుగైన ఓట్ల శాతం రాబట్టింది. ఎంత వరకు విజయం వరిస్తుందో చూడాలి. దీనిపై మీ కామెంట్..

error: Content is protected !!