News March 3, 2025
NGKL: పాముకాటుతో రైతు మృతి

పొలంలో పనిచేస్తున్న రైతును పాము కాటేయటంతో మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల వివరాలిలా.. ఉర్కొండ మండలం జకినాలపల్లికి చెందిన సాయిరెడ్డి(65) పొలంలో పనిచేసుకుంటుండగా పాము కాటేసింది. దీంతో ఆయన ఇంటికి వెళ్లారు. పరిస్థతి విషమించటంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు.
Similar News
News December 15, 2025
జాబ్ చేసుకుంటూ బీటెక్!

వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ చదువును కొనసాగించేందుకు AICTE పర్మిషన్ ఇచ్చింది. ఉద్యోగం చేస్తూనే డిప్లొమా, బీటెక్, ఎంటెక్, MBA వంటి కోర్సులు పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం కాలేజీలు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అమలు చేసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు ఆఫీసు వేళల తర్వాత లేదా వీకెండ్స్‌లో క్లాసులకు హాజరుకావచ్చు. ఇప్పటికే ఈ విధానం కొన్నిచోట్ల అమల్లో ఉండగా, ఇకపై పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
News December 15, 2025
జనగామలో కారు జోరు!

జిల్లాలో BRS రెండో విడతలో మెజార్టీ పంచాయతీలను గెలుచుకుంది. రెండు విడతల్లో 79 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, బీఆర్ఎస్ 37, కాంగ్రెస్ 26, బీజేపీ 4, ఇతరులు 12 పంచాయతీలను గెలుచుకున్నారు. బచ్చన్నపేటలో 26 పంచాయతీల్లో 15 బీఆర్ఎస్, జనగామ 21లో 9, నర్మెట్టలో 17లో 8, తరిగొప్పులలో 15 పంచాయతీల్లో 5 పంచాయతీలను బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. బీజేపీ సైతం జనగామ 2, బచ్చన్నపేటలో 2 పంచాయతీలను గెలుచుకుంది.
News December 15, 2025
‘AGRATE’ ఏం చేస్తుంది?

‘AGRATE’ చిన్న రైతులకు నాణ్యమైన విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్, ఆధునిక వ్యవసాయ పరికరాలు, సేంద్రియ ఎరువులను తక్కువ ధరకే అందిస్తోంది. అలాగే కొమ్మలను అంటుకట్టడం, ఎక్కువ పంటల సాగు, స్థిరమైన వ్యవసాయ విధానాలపై రైతులకు ఆధునిక శిక్షణ ఇవ్వడంతో పంట దిగుబడి పెరిగింది. ITC, Godrej, Parle వంటి కంపెనీలతో శుక్లా ఒప్పందం చేసుకోవడంతో రైతుల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెరిగి వారి ఆదాయం గణనీయంగా పెరిగింది.


