News April 3, 2025

NGKL: పిడుగుపాటుకు చనిపోయింది వీళ్లే!

image

నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలంలో <<15978702>>పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతిచెందిన విషయం తెలిసిందే<<>>. వేరుశనగ పొలాల్లో కూలీ పనులకు వెళ్లిన సమయంలో వచ్చిన భారీ వర్షంలో పిడుగు పడటంతో మండలంలోని కండ్లకుంట ప్రాంతానికి చెందిన సుంకరి సైదమ్మ (35), వీరమ్మ (55) అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ సుంకరి లక్ష్మమ్మ గాయపడగా ఆమెను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News April 10, 2025

బాలానగర్: రైలు ఢీకొని.. వృద్ధురాలు మృతి

image

రైలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి రైల్వే ట్రాక్‌పై బుధవారం జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ వివరాల ప్రకారం.. పెద్దాయపల్లికి చెందిన బొట్టు మైసమ్మ (60) హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తున్న రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. స్టేషన్ మాస్టర్ నర్సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

News April 10, 2025

MBNR: బెట్టింగ్‌కు యువత బలి కావద్దు: ఎస్పీ

image

మహబూబ్నగర్ జిల్లాలో ఎవరైనా క్రికెట్, ఇతర బెట్టింగ్‌లకు పాల్పడిన ప్రోత్సహించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. ఇటీవల సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచనతో యువత అధికంగా క్రికెట్ బెట్టింగ్ మోజులోపడి వారి బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా, మోసగాళ్ల మోసపూరితమైన ప్రకటనలు, సందేశాలకు యువత ఆకర్షితులై మోసపోతున్నారు. 100 డయల్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

News April 9, 2025

GREAT: ఇంగ్లాండ్ క్రికెట్ రెండో కౌంటీకి పాలమూరు బిడ్డ ❤

image

మహబూబ్‌నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్(MDCA) కృషితో ఉమ్మడి పాలమూరు జిల్లా మరికల్(M) వెంకటాపురంకి చెందిన జి.గణేశ్ ఇంగ్లాండ్ క్రికెట్ రెండో కౌంటీకి ఎంపికయ్యాడు. ఆరేళ్లపాటు ఒప్పందం కుదరడంతో ఐదు సిరీస్‌లలో 20 మ్యాచ్‌లు ఆడనున్నారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ 2వ కౌంటీలకు ఎంపిక అవ్వడం సంతోషంగా ఉందని, భారత జట్టుకు ఆడడం తన లక్ష్యమన్నారు.

error: Content is protected !!