News March 13, 2025
NGKL: ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతి

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామానికి చెందిన సల్వాది లక్ష్మయ్య, నర్సమ్మల కుమార్తె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం నియామక పత్రాన్ని అందజేసింది. పేద కుటుంబానికి చెందిన యువతి ఉద్యోగం సాధించడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 14, 2025
MBNR : నవవధువు సూసైడ్

మహబూబ్‌నగర్ జిల్లాలో నవవధువు సూసైడ్ చేసుకుంది. పోలీసులు వివరాలు.. కొందుర్గు మం. ఎన్కెపల్లికి చెందిన సుజాత(21)కు నవాబ్‌పేట మం. లింగంపల్లికి చెందిన రాములుతో గత నెల 7న పెళ్లైంది. కాగా పెళ్లికి రూ.6 లక్షలు అయ్యాయని అవి తీసుకురావాలని భర్త ఇబ్బంది పెట్టాడు. ఈక్రమంలో వెంకిర్యాలలో టీస్టాల్‌లో పనిచేస్తున్న తల్లిదండ్రుల వద్దకొచ్చిన సుజాత బాత్‌రూమ్‌లో ఉరేసుకుంది. ఘటనపై కేసు నమోదైనట్లు SI బాలస్వామి తెలిపారు.
News March 14, 2025
NGKL: అత్తమామల సాకారంతో GOVT ఉద్యోగం.!

కోడేరు మండలానికి చెందిన ఫౌజియాకు జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం సాధించింది. హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన కొలువుల పండుగలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాన్ని ఆమె అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అత్త, మామ, భర్త సాకారంతో ఈ ఉద్యోగం సాధించానని, వారి సహకారం మరువలేనని తెలిపారు.
News March 14, 2025
MBNR: విపత్తుల నివారణకు 300 మంది వాలంటీర్లు: జిల్లా కలెక్టర్

సహజ మానవ కల్పిత విపత్తులను నివారించేందుకు 300 మంది వాలంటీర్లను నియమించినట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. గురువారం ఆపదమిత్ర వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రకృతి మానవ కల్పిత విపత్తులు జరిగినప్పుడు అధికారులు ఘటనా స్థలానికి చేరుకునే లోగా పౌరులే స్వయంరక్షణ పద్ధతులను పాటిస్తూ ఇతరుల ప్రాణాలను, ఆస్తి నష్టాలు కాకుండా ఏ విధంగా నివారించాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.