News March 13, 2025
NGKL: ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతి

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామానికి చెందిన సల్వాది లక్ష్మయ్య, నర్సమ్మల కుమార్తె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం నియామక పత్రాన్ని అందజేసింది. పేద కుటుంబానికి చెందిన యువతి ఉద్యోగం సాధించడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 13, 2025
రాహుల్ గాంధీతో ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెంట ఛార్టెడ్ ఫ్లైట్‌లో ఆయన హస్తినకు వెళ్తారు. ఓట్ చోరీ అంశంపై ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రేపు కాంగ్రెస్ నిర్వహించనున్న నిరసనలో సీఎం పాల్గొంటారు.
News December 13, 2025
కొండపి: తీవ్రంగా నష్టపోయిన పొగాకు రైతులు

కొండపి పొగాకు వేలంకేంద్రంలో కొనుగోళ్లు ముగిసినప్పటికీ రైతులకు తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. సుమారు వేలం 9నెలల పాటు నిర్వహించడంతో పండించిన పొగాకు నాణ్యత కోల్పోయి ఆశించినంత మేర ధరలు రాక రైతులు నష్టాల బాట పట్టారు. బోర్డ్ అధికారులు రైతులకు సగటు ధర ఇప్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఒక్కో బ్యారర్‌కు రూ.2లక్షల పైబడి నష్టం వాటిలినట్లు రైతులు వాపోతున్నారు.
News December 13, 2025
15న విశాఖలో వైసీపీ కోటి సంతకాల ర్యాలీ: కేకే.రాజు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమానికి పలు వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని జిల్లా అధ్యక్షుడు కేకే.రాజు అన్నారు. శనివారం YCP కార్యాలయంలో నేతలతో సమావేశమయ్యారు. డిసెంబర్ 15న GVMC గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెం జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లన్నున్నట్లు తెలిపారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమం వినతి పత్రాలను తాడేపల్లికి ఆరోజు పంపనున్నట్లు చెప్పారు.


