News February 11, 2025

NGKL: బైక్ కొనివ్వనన్నందుకు తండ్రి ఆత్మహత్యాయత్నం

image

కోడేరు మండల కేంద్రంలో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. కోడేరుకు చెందిన వెంకటశేషయ్య బైక్ కొనివ్వాలని తన కొడుకుని అడిగారు. దీనికి కొడుకు అంగీకరించకపోవటంతో.. ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 14, 2025

చీనీ తోటలకు కలుపు మందులతో ముప్పు

image

చీనీ తోటల్లో రసాయన ఎరువులు, పురుగు మందులు, కలుపు మందుల వల్ల చెట్లలో వైరస్ ముప్పు పెరుగుతోంది. దీని వల్ల ఎండు తెగులు, వేరుకుళ్లు, పొలుసు పురుగు, నల్లి, మంగు, బంక తెగులు లాంటి చీడపీడలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కలుపు మందులతో తోటల జీవితకాలం తగ్గడంతో పాటు చెట్లు చనిపోతున్నట్లు వ్యవసాయ నిపుణులు గుర్తించారు. ట్రాక్టర్ లేదా కూలీలతో కలుపు తీయిస్తే భూమి గుల్లబారి పంటకు మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు.

News December 14, 2025

తిరువూరు తలనొప్పి.. MLA vs MP పోరుపై బాబు చర్యలుంటాయా.?

image

తిరువూరు నియోజకవర్గంలో MLA vs MP వర్గాల ఆధిపత్య పోరు TDP అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. వీరి విమర్శలు పార్టీపై ప్రభావం చూపుతాయేమోనని జిల్లా నేతలు ఆందోళన చెందుతున్నారు. పలుమార్లు అధిష్ఠానం పెద్దలు మాట్లాడినా ప్రయోజనం లేకపోవడంతో, CM చంద్రబాబు నేరుగా జోక్యం చేసుకుని గట్టిగా మందలిస్తే తప్ప ఈ గొడవలు ఆగేలా లేవని నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

News December 14, 2025

చికెన్ కిలో ధర ఎంతంటే?

image

APలోని VJAలో చికెన్ స్కిన్‌‌లెస్ కేజీ ₹270, స్కిన్‌ ₹260గా ఉంది. గుంటూరు(D) కొల్లిపరలో స్కిన్ చికెన్ కేజీ ₹240, స్కిన్ లెస్ రూ.260గా అమ్ముతున్నారు. నరసరావుపేటలో కేజీ స్కిన్ లెస్‌ ₹250, స్కిన్‌తో ₹260గా ఉంది. TGలోని హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ ₹260-₹280, స్కిన్‌తో ₹240-₹260గా అమ్ముతున్నారు. కామారెడ్డిలో చికెన్ కిలో ₹250, మటన్ కిలో ₹800 పలుకుతోంది. మీ దగ్గర రేట్లు ఎలా ఉన్నాయి? Comment.