News March 6, 2025

NGKL: యువకుడి ఆత్మహత్య

image

NGKL జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మారేడుమాన్ దిన్నె గ్రామానికి చెందిన కేతావత్ మైబు నాయక్(23) బుధవారం సాయంత్రం మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగారు. మైబు నాయక్ అందరితో ప్రేమగా, మైత్రిగా ఉండే వ్యక్తి అని గ్రామస్థులు భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు.

Similar News

News December 15, 2025

కుప్పంలో CBG ప్లాంట్‌కు గ్రీన్ సిగ్నల్

image

క్లీన్ ఎనర్జీ పెట్టుబడులకు ఊతమిస్తూ AP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024’ కింద కుప్పం (M) కృష్ణదాసనపల్లిలో 10 TPD సామర్థ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్‌ను శ్రేష్ఠా రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. నేపియర్ గడ్డి, సేంద్రీయ వ్యర్థాలతో CBGతో పాటు ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ మెన్యూర్ (PROM) ఉత్పత్తి చేయనున్నారు.

News December 15, 2025

SPMVV: ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

image

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు SPMVV ఆధ్వర్యంలో నవంబర్ నెలలో నిర్వహించిన AP – RCET ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఈ ప్రవేశ పరీక్ష మొత్తం 65 సబ్జెక్టులకు నిర్వహించినట్లు చెప్పారు. 5,164 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాగా 2,859 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలియజేశారు. ఫలితాలు https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.

News December 15, 2025

రేపు ఉదయం దట్టమైన పొగమంచు.. జాగ్రత్త

image

తెలంగాణలో రేపు దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా దక్షిణ, తూర్పు, సెంట్రల్ తెలంగాణ జిల్లాల ప్రజలు రేపు ఉదయం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హైవేలపై ప్రయాణం చేసే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని, వీలైతే బయటకు వెళ్లొద్దని సూచించారు. అలాగే కోల్డ్ వేవ్ కండిషన్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
Share it