News April 1, 2025
NGKL: యువతి ఒంటరిగా రావడం అదునుగా తీసుకున్నారు: ఐజీ

NGKL జిల్లా ఊర్కొండపేట ఆలయానికి వచ్చిన వివాహిత గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనా స్థలాన్ని ఈరోజు మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ పరిశీలించి మాట్లాడారు. అత్యాచారం చేసిన మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని, ఆమె ఒంటరిగా రావడాన్ని వారు అదునుగా తీసుకున్నారని తెలిపారు. యువతిని బెదిరించి అత్యాచారం చేశారని, నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామన్నారు.
Similar News
News April 3, 2025
బాధితులకు అండగా భరోసా: MHBD ఎస్పీ

మహబూబాబాద్ జిల్లాలో బాధితులకు భరోసా సెంటర్ నిలుస్తోందని ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ అన్నారు. భరోసా సెంటర్ నుంచి 8 మంది బాధితులకు అందాల్సిన రూ.65 వేల చెక్కులు, ఒకరికి కుట్టు మిషన్‌ను ఆయన గురువారం అందజేశారు. ఆయనతో పాటు డీఎస్పీ తిరుపతిరావు, ఎస్ఐ దీపికా రెడ్డి, భరోసా ఎస్ఐ ఝాన్సీ, తదితరులు ఉన్నారు.
News April 3, 2025
రూ.1.35 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్: పార్థసారథి

AP: అనకాపల్లి జిల్లాలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో మెస్సర్స్ ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. రెండు దశల్లో 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో నిర్మాణం జరుగుతుందన్నారు. మొదటిదశలో రూ.55,964 కోట్ల పెట్టుబడి, రెండో దశలో రూ.80వేల కోట్ల పెట్టుబడితో నిర్మాణాలు జరుగుతాయన్నారు. వీటి ద్వారా 55 వేల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశారు.
News April 3, 2025
ALERT.. కాసేపట్లో వర్షం

తెలంగాణ వ్యాప్తంగా కాసేపట్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, ములుగు, KRMR, MDK, సిరిసిల్ల, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ ఇచ్చింది. HYD, మంచిర్యాల, మేడ్చల్, NLG, RR, VKB జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మీ ప్రాంతంలో వర్షం కురుస్తోందా? కామెంట్ చేయండి.