News March 15, 2025
NGKL: శ్రీశైలం హైవేపై వాహనాల రాకపోకలపై సర్వే.!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్రాబాద్ మండలం శ్రీశైలం హైవేలో 7,668 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయనుంది. రోజుకు ఈ రోడ్డుపై సగటున 7,181 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన్ననూరు చెక్‌పోస్ట్ వరకు 6,880, వట్వర్లపల్లి ఈగలపెంట మధ్య 7,005 వాహనాలు తిరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రోడ్డుపై శ్రీశైలానికి, ఏపీకి ఎన్ని వాహనాలు వెళుతున్నాయనే వివరాలను సేకరిస్తున్నారు.
Similar News
News March 15, 2025
22 రోజులైనా దొరకని కార్మికుల జాడ

TG: SLBC టన్నెల్‌లో కార్మికులు చిక్కుకుపోయి 22 రోజులైనా వారి జాడ తెలియడం లేదు. రోబోకు అనుసంధానంగా లిక్విడ్ రింగ్ వాక్యూమ్ ట్యాంక్ యంత్రంతో రెస్క్యూ చేపడుతున్నారు. D-2 ప్లేస్‌లో 4 మానవ అవశేషాలు ఉన్నట్లు GPR స్కానర్ చూపినా అక్కడ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. దీంతో అక్కడ తవ్వకాలు నిలిపేసి హై రిస్క్ ఉన్న D-1 దగ్గర తవ్వకాలు జరపాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు ఒక మృతదేహం బయటపడిన విషయం తెలిసిందే.
News March 15, 2025
SKLM: పొట్టి శ్రీరాములు జయంతికి కలెక్టర్ పిలుపు

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు శ్రీకాకుళం పాత బస్ స్టాండ్‌లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి అధికారులు హాజరై నివాళులర్పించాలని కలెక్టర్ కోరారు.
News March 15, 2025
PPM: మూడు అంబులెన్స్‌లను అందించిన NPCI

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పార్వతీపురం మన్యం జిల్లాకు మూడు అంబులెన్స్‌లను అందించారు. ఈ అంబులన్స్‌లను సాలూరులో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించగా, పార్వతీపురంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్, స్థానిక శాసన సభ్యులు బోనెల విజయ చంద్రతో కలసి శనివారం ప్రారంభించారు.