News October 26, 2024
మూగజీవాల కోసం ఎన్జీవో: రేణూదేశాయ్

మూగ జీవాల రక్షణ కోసం సొంత ఎన్జీవోను రిజిస్టర్ చేయించినట్లు రేణూదేశాయ్ తెలిపారు. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు ముందుకు రావాలని వీడియోలో వెల్లడించారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో తన ఫాలోవర్స్‌తో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. చిన్నతనం నుంచి మూగజీవాల సంరక్షణ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఈ క్రమంలో వాటి కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఎన్జీవోను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 10, 2026
ఈనెల 24 నుంచి విశాఖ ఉత్సవాలు

విశాఖ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిద్దామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్ మీటింగు హాలులో అధికారులతో సమావేశమైయ్యారు. విశాఖ పర్యాటకంగా ఎంతో ప్రాముఖ్యతను సొంతం చేసుకుందని మంత్రులు పేర్కొన్నారు. జనవరి 24, 25వ తేదీల్లో అనకాపల్లిలో, 26 నుంచి జనవరి 31 వరకు విశాఖ, ASR జిల్లాలో కూడా ఉత్సవాలు జరుగుతాయన్నారు.
News January 10, 2026
GWL: సీఎం కప్‌తో ప్రతిభకు పదును: కలెక్టర్ సంతోష్

గద్వాల జిల్లాలో క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు ‘సీఎం కప్-2025’ అద్భుత వేదికని జిల్లా కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో కలిసి ఆయన పోటీల పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆయన ఆకాంక్షించారు.