News March 28, 2024

ప్రధాని మోదీ కార్లకు అనుమతి నిరాకరించిన NGT

image

ప్రధాని మోదీ కాన్వాయ్‌కు చెందిన మూడు కార్లకు రిజిస్ట్రేషన్ పొడిగించాలన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) విజ్ఞప్తిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తిరస్కరించింది. పదేళ్లకు మించిన డీజిల్ కార్లను 2018లో సుప్రీంకోర్టు నిషేధించడమే ఇందుకు కారణంగా పేర్కొంది. రెనాల్ట్ ఎండీ-5 మోడల్‌కు చెందిన ఈ కార్లకు 2014లో రిజిస్ట్రేషన్ అయింది. తక్కువ కిలోమీటర్లే తిరగడంతో వీటి రిజిస్ట్రేషన్ పొడిగించమని SPG కోరింది.

Similar News

News March 27, 2026

TODAY HEADLINES

image

*పశ్చిమాసియా సంక్షోభం.. సీఎంలతో రేపు మోదీ మీటింగ్
*AP: మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. 13 మంది మృతి
*అమరావతికి చట్టబద్ధత కల్పించేలా క్యాబినెట్ తీర్మానం
*నియోజకవర్గాలు 50% పెరుగుతాయి: CBN
*TG: ఆరోగ్యశ్రీకి ప్రతి నెలా రూ.89 కోట్లు: రేవంత్
*మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి
*IPL రెండో ఫేజ్ షెడ్యూల్ విడుదల

News March 27, 2026

TODAY HEADLINES

image

*పశ్చిమాసియా సంక్షోభం.. సీఎంలతో రేపు మోదీ మీటింగ్
*AP: మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. 13 మంది మృతి
*అమరావతికి చట్టబద్ధత కల్పించేలా క్యాబినెట్ తీర్మానం
*నియోజకవర్గాలు 50% పెరుగుతాయి: CBN
*TG: ఆరోగ్యశ్రీకి ప్రతి నెలా రూ.89 కోట్లు: రేవంత్
*మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి
*IPL రెండో ఫేజ్ షెడ్యూల్ విడుదల

News March 27, 2026

సిలిండర్ ఇవ్వండి.. నెలరోజులు ఫ్రీగా బిర్యానీ తినండి!

image

తమిళనాడు హోసూరులో ఓ హోటల్ ఓనర్ పెట్టిన వినూత్న ఆఫర్ ఇది. కమర్షియల్ సిలిండర్ల కొరతతో హోటళ్లు మూతపడే పరిస్థితి వచ్చింది. దీంతో యజమాని అశోక్ ఇలా ప్రకటించడంతో SMలో వైరల్‌ అయింది. ఫుల్ సిలిండర్‌ తీసుకొని, వెంటనే దానికైన డబ్బులు, ఖాళీ సిలిండర్ ఇచ్చేస్తామని చెప్పాడు. దీంతో గత 15 రోజుల్లో 6 సిలిండర్లు వచ్చినట్లు తెలిపాడు. కానీ సిలిండర్ ఇచ్చినవారిలో ఎవరూ 2-3 రోజులకు మించి ఫ్రీగా బిర్యానీ తినలేదట.