News November 6, 2025

NH అధికారులపై MLAలు సీరియస్.. DPR తయారు చేయడం మీ ఇష్టమేనా.?

image

విజయవాడ-మచిలీపట్నం NH-65 ఆరు లైన్ల విస్తరణ డీపీఆర్ తయారీపై కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు ఎన్‌హెచ్ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కంకిపాడు వరకు భవిష్యత్తులో మెట్రో, నగర విస్తరణ ఉంటుందని పేర్కొంటూ.. బెంజ్ సర్కిల్ నుంచి ఎలివేటెడ్ కారిడార్ (ఫ్లైఓవర్) లేదా రద్దీ మార్గాల్లో అండర్ పాస్‌ల నిర్మాణం చేయాలని సూచించారు. డీపీఆర్‌లో మార్పులు చేయాలని స్పష్టం చేశారు.

Similar News

News November 6, 2025

తిరుపతి, చిత్తూరు జిల్లాలో మార్పులు..!

image

నగరి నియోజకవర్గాన్ని పూర్తిగా తిరుపతి జిల్లాలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. నగరి డివిజన్‌లోని కార్వేటినగరం, పాలసముద్రం, పలమనేరు డివిజన్‌లోని బంగారుపాళ్యాన్ని చిత్తూరులో కలపనున్నారు. పుంగనూరును మదనపల్లె లేదా పీలేరు డివిజన్‌లో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్నారు. వెదురుకుప్పం, కార్వేటినగరాన్ని తిరుపతి జిల్లాలో కలపాలనే డిమాండ్‌ మీద చర్చ జరగలేదు. గూడూరును నెల్లూరు జిల్లాలోకి మార్చనున్నారు.

News November 6, 2025

జనగామ: పత్తి అమ్మకంలో రైతుల ఇక్కట్లు!

image

జిల్లాలోని ఆయా మండలాల పత్తి రైతులు పత్తి అమ్మకంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం, ఎకరానికి 7 క్వింటాల పత్తి మాత్రమే అమ్మకంలో చూపించడం, ఎంత భూమి పత్తి పై ఉందో, ఎంత భూమి వరిపై ఉందో తెలియక సతమతమవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని కిసాన్ కపాస్ యాప్‌లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చి పత్తి అమ్మకం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

News November 6, 2025

గద్వాల్: మధ్యాహ్న భోజన ఛార్జీల పెంపు.. ఏజెన్సీలకు ఊరట

image

ప్రభుత్వం విద్యార్థుల కోసం అందించే మధ్యాహ్న భోజన పథకానికి ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ అధికారులు వెంటనే అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,227పాఠశాలల్లో 3,58,400 విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి అందిస్తున్న భోజనం కోసం పెరిగిన ధరల ప్రకారం నెలకు రూ.86 లక్షల అదనపు భారం పడనుంది. ధరలు పెరిగిన క్రమంలో ప్రభుత్వ ప్రకటనతో ఏజెన్సీలకు ఊరటనిసస్తోంది.