News February 26, 2026
NH-365BG ప్రత్యేకతలివే..

ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మిస్తోన్న 4 లేన్ల NH-365BGకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ హైవేపై అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కింద ప్రతి 2KMలకు ఒకటి చొప్పున 95 CCTVలు ఉంటాయి. ఈ రూట్‌లో ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది. రహదారి మొత్తం సోలార్ లైట్లు ఉంటాయి. 5KMకు ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. ఈ రోడ్డులో ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జీ చెల్లించాలి.
Similar News
News February 26, 2026
FLASH: మళ్లీ తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర <<19241792>>మరోసారి<<>> తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.870 తగ్గి రూ.1,61,020కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.800 పతనమై రూ.1,47,600 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 26, 2026
731 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News February 26, 2026
తొమ్మిది మందిలో ఒకరికి షుగర్ వ్యాధి: వైద్యులు

ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి షుగర్ ఉన్నా సగం మందికి ఆ విషయమే తెలియట్లేదని వైద్యులు చెబుతున్నారు. చక్కెర వల్లే షుగర్ వ్యాధి వస్తుందనుకోవడం అపోహ అని, వ్యాయామం చేయకపోవడంతో పాటు వంశపారంపర్య కారణాలు కూడా ఉంటాయని తెలిపారు. సన్నగా ఉన్నా, చిన్న వయసు వారైనా పరీక్షలు చేయించుకోవాలని.. బెల్లం, తేనె వాడినా షుగర్ పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ట్యాబ్లెట్స్ వాడుతున్నా ఆహార నియమాలు పాటించాలని సూచిస్తున్నారు.


