News February 7, 2026
NHAIలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు.. అప్లై చేశారా?

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)లో 40 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. బీఈ/బీటెక్(సివిల్)అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గేట్ 2025 స్కోరు ఆధారంగా ఎంపిక చేయనున్నారు. నెలకు రూ.56,100-రూ.1,77,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nhai.gov.in/
Similar News
News February 21, 2026
భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలు ఇంటికే!

శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి రాములోరి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే పంపించేందుకు TGSRTC సిద్ధమైంది. రూ.151 చెల్లించి RTC లాజిస్టిక్ కేంద్రాల్లో లేదా ఆన్‌లైన్‌లో ఈ నెల 23 నుంచి బుక్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి ప్రకటించారు. భద్రాద్రికి వెళ్లలేని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 040-23450033, 040-69440069కు కాల్ చేయండి. share it
News February 21, 2026
రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో రేపు(FEB 22), ఎల్లుండి(FEB 23) పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. తూ.గో.లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, GNT, అన్నమయ్య, CTR, TPT జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
News February 21, 2026
ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త

TG: బీఆర్ఎస్ హయాంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన గృహలక్ష్మీ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగులో ఉన్న బిల్లులను చెల్లించాలని నిర్ణయించింది. అయితే ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాల ప్రకారం పునాది ప్రాంతం 400-600sq ft మధ్య ఉండాలి. బేస్‌మెంట్ పూర్తయితే ఆ దశ డబ్బులు చెల్లించరు. పై కప్పు లెవల్ వరకు ₹లక్ష, స్లాబ్ పూర్తయితే ₹2L, మొత్తం నిర్మాణం పూర్తయితే మరో ₹లక్ష చెల్లించనుంది.


