News December 21, 2025

NHIDCLలో 48 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NHIDCL) 48 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు DEC 31వరకు అప్లై చేసుకోవచ్చు. Sr మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, Sr జనరల్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ టెస్ట్, రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com/

Similar News

News December 29, 2025

ESIC హాస్పిటల్ కలబురగిలో ఉద్యోగాలు

image

<>ESIC<<>> హాస్పిటల్, కలబురగి 6 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 9న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి BDS, MBBS, MD, MSc(మెడికల్ ఫిజియాలజీ), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నెలకు జీతం ప్రొఫెసర్‌కు రూ.2,34,630, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,56,024, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,34,046 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in

News December 29, 2025

శీతాకాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే?

image

శీతాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల పిల్లలు త్వరగా రోగాలబారిన పడతారు. ఇలా కాకుండా ఉండాలంటే కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. పిల్లలు పరిశుభ్రత పాటించడం, నీరు ఎక్కువగా తాగడం ముఖ్యం. అలాగే పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఇవ్వాలి. వీటితో పాటు పప్పుధాన్యాలు, పాలు, పెరుగు, గుడ్లు, నట్స్ వంటి పోషకాహారాన్ని వారి ఆహారంలో చేర్చాలి. జంక్ ఫుడ్‌ను నివారించాలని సూచిస్తున్నారు.

News December 29, 2025

‘పెద్ది’లో జగపతిబాబు షాకింగ్ లుక్

image

రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి నటుడు జగపతిబాబు ఫస్ట్ లుక్ విడుదలైంది. చూసిన వెంటనే గుర్తుపట్టలేనంతగా ఉన్న ఆయన లుక్ అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. ‘అప్పలసూరి’ అనే పాత్రలో జగపతిబాబు కనిపించనున్నట్లు మూవీటీమ్ ప్రకటించింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.