News December 18, 2025

NHIDCLలో 64 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>NHIDCL <<>>64 అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి జనవరి 12వరకు అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. జీతం నెలకు రూ.70,000-రూ.80,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com

Similar News

News December 19, 2025

గ్రీన్ కార్డ్ లాటరీని నిలిపేసిన ట్రంప్

image

గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ వెల్లడించారు. ‘బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులు జరిపిన క్లాడియో మాన్యుయెల్ 2017లో డైవర్సిటీ లాటరీ ఇమిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ ద్వారా USలోకి వచ్చాడు. తర్వాత గ్రీన్ కార్డు పొందాడు. ఇలాంటి దారుణమైన వ్యక్తులను దేశంలోకి అనుమతించకూడదు’ అని పేర్కొన్నారు.

News December 19, 2025

గ్రీన్‌కార్డ్ లాటరీ సస్పెండ్.. ఇండియన్స్‌పై ప్రభావమెంత?

image

USలో గ్రీన్‌కార్డ్ లాటరీని <<18612958>>సస్పెండ్<<>> చేసిన నేపథ్యంలో భారతీయులపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. సాధారణంగా డైవర్సిటీ వీసాతో అమెరికాలోకి ప్రవేశించిన వారిలో ఏటా 50,000 మందికి లాటరీ ద్వారా గ్రీన్‌కార్డ్ జారీ చేస్తారు. కొన్నేళ్లుగా ఈ వీసా భారతీయులకు ఇవ్వడం లేదు. కాబట్టి మనవాళ్లపై ఇప్పటికైతే ప్రభావం ఉండదు. కానీ US ఇమిగ్రేషన్ పాలసీ మరింత కఠినంగా మారుతున్న విషయం మాత్రం స్పష్టమవుతోంది.

News December 19, 2025

GP నిధులు ఇలా చెక్ చేసుకోండి

image

GP నిధులను విత్ డ్రా చేయాలంటే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి/ఉప సర్పంచ్ ఉమ్మడి సంతకం(డిజిటల్ కీ) అవసరం. egramswaraj.gov.inలో GPకి కేటాయించిన, ఖర్చు చేసిన నిధుల వివరాలను గ్రామస్థులు తెలుసుకోవచ్చు. హోమ్ పేజీలో కిందకు స్క్రోల్ చేస్తే ఉండే రిపోర్ట్స్ సెక్షన్‌లో ప్లానింగ్ అండ్ రిపోర్టింగ్‌పై క్లిక్ చేయాలి. తర్వాత రాష్ట్రం, జిల్లా, మండలం/బ్లాక్, గ్రామ పంచాయతీని ఎంచుకొని ‘గెట్ రిపోర్ట్‌’లో వివరాలు చూడవచ్చు.