News February 27, 2026

NHM తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలు

image

నేషనల్ హెల్త్ మిషన్(NHM) తూర్పు గోదావరి జిల్లాలో 9 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 11 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(స్పీచ్&లాంగ్వేజ్ పాథాలజీ), పీజీ(చైల్డ్ సైకాలజీ, MA, MSc సైకాలజీ, ఆప్టోమెట్రీ), డెంటల్ టెక్నీషియన్ కోర్సు, GNM అర్హతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in

Similar News

News February 27, 2026

DINK జంటలకూ డబ్బు సరిపోవట్లేదు!

image

పిల్లల బాధ్యత, ఖర్చుల నుంచి తప్పించుకునేందుకు చాలా జంటలు డ్యుయల్ ఇన్‌కమ్, నో కిడ్స్ (DINK) పాలసీని ఫాలో అవుతున్నాయి. కానీ వీరిలో చాలా మందికి సంపాదన సరిపోవడం లేదు. పొదుపుపై దృష్టి పెట్టకుండా ఆదాయాన్ని ఖర్చులు, జల్సాలకు వాడుకోవడం.. ఒకరి ఖర్చులు మరొకరు పట్టించుకోకపోవడం, ఆదాయానికి తగినట్టు ఖర్చులు పంచుకోకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. ఆదాయంతో సంపద పెరుగుతుంది అనుకోవడం పొరపాటని నిపుణులు చెబుతున్నారు.

News February 27, 2026

మార్చి 28న ఐపీఎల్ ప్రారంభం?

image

ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 28న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబరులో BCCI ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీని మార్చి 26గా ప్రకటించింది. అయితే అస్సాం, బెంగాల్, తమిళనాడు ఎన్నికల తేదీలపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ప్రారంభ తేదీని 28కు మార్చినట్లు క్రిక్ఇన్ఫో వెల్లడించింది. ఫైనల్ మే 31న జరగనుందని తెలిపింది. కాగా వచ్చే వారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

News February 27, 2026

ఎవరీ నటి.? తెగ సెర్చ్ చేస్తున్నారు..

image

ప్రభాస్-సందీప్ కాంబోలో వస్తున్న ‘స్పిరిట్’ మూవీ నుంచి ఇవాళ <<19254726>>అప్డేట్<<>> వచ్చిన విషయం తెలిసిందే. తాజా పోస్టర్‌లో వివేక్ ఒబెరాయ్‌తో పాటు ఓ నటి ఉన్నారు. గాగుల్స్ ధరించి ఉన్న ఆమె ఎవరా? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే ఐశ్వర్య దేశాయ్. ‘గల్లీ బాయ్’ మూవీతో పాటు ర్యాట్ ఇన్ ది కిచెన్ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. స్పిరిట్‌లో ఈమె కీలకపాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.