News February 22, 2025

ఏపీ CS, DGPకి NHRC నోటీసులు

image

AP: తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన అవాంఛనీయ ఘటనలపై NHRC ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతుంటే పోలీసులేం చేస్తున్నారని ప్రశ్నించింది. వారికి ఎందుకు భద్రత కల్పించలేదని నిలదీసింది. వైసీపీ ఎంపీ గురుమూర్తి పలువురిపై ఫిర్యాదు చేస్తే వారి పేర్లు FIRలో ఎందుకు లేవో చెప్పాలంది. ఈ అంశంపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.

Similar News

News December 27, 2025

ప్రమాదాల నివారణపై ప్రత్యేక డ్రైవ్: ఎస్పీ

image

రహదారుల ప్రమాదాల నివారణపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ శుక్రవారం తెలిపారు. రాత్రి 12 నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు ఈ డ్రైవ్ కొనసాగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా సంతమాగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 89 ప్రమాదాలు నమోదు కాగా, బాపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 50 కేసులు నమోదయాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

News December 27, 2025

సరిగ్గా నిద్ర పోవట్లేదా..?

image

నైట్ ఔట్‌లు, సినిమాలు, షికార్లు అంటూ కొందరు నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. ఇంకొందరు జాబ్ వల్ల సరైన నిద్రలేక అవస్థలు పడుతుంటారు. కారణమేదైనా రోజుకు కనీసం 7గం. నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి కావాల్సినంత నిద్ర, విశ్రాంతి లభించకపోతే బోలెడు వ్యాధులు చుట్టుముడతాయి. బీపీ, షుగర్, డిప్రెషన్, ఊబకాయంతో పాటు హార్ట్‌స్ట్రోక్, గుండె జబ్బులు కూడా వస్తాయని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. ShareIt.

News December 27, 2025

పరకామణి కేసు.. HCకి ఏసీబీ మధ్యంతర నివేదిక

image

AP: టీటీడీ పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు రవికుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ ఇవాళ హైకోర్టుకు మధ్యంతర నివేదిక సమర్పించింది. దాన్ని పరిశీలించిన తర్వాత తగిన ఉత్తర్వులు ఇస్తామని న్యాయస్థానం తెలిపింది. కేసు పరిస్థితుల ఆధారంగా మరో FIR నమోదు చేయాల్సిన అవసరం ఉందని, సీఐడీ దీన్ని పరిశీలించాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా వేసింది.