News September 10, 2024
జైనూర్ ఘటనలో ప్రభుత్వానికి NHRC నోటీసులు

TG: ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్‌లో మహిళపై అత్యాచార <<14027592>>ఘటనలో<<>> రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో దీనిపై వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీపీని ఆదేశించింది. కాగా అత్యాచార ఘటనను NHRC సుమోటోగా స్వీకరించింది.
Similar News
News February 5, 2026
వ్యవసాయ రంగం అంటే చంద్రబాబుకు చిన్నచూపు: సజ్జల

AP: వ్యవసాయ రంగంపై చంద్రబాబుకు చిన్నచూపు ఉందని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం రాయలసీమకే కాకుండా రాష్ట్రానికే ఘోర అన్యాయమన్నారు. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పథకాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. YCP నిర్వహించిన ఛలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో సజ్జలతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.
News February 5, 2026
హనీమూన్ మర్డర్ 2.0.. ప్రియుడితో కలిసి భర్త హత్య

మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ తరహాలో రాజస్థాన్‌లోనూ ఓ హత్య జరిగింది. గంగానగర్ పోలీసుల కథనం ప్రకారం.. JAN 30న ఓ కపుల్‌ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. భర్త ఆశిష్ స్పాట్‌లో చనిపోయారు. భార్య అంజు వద్ద దుండగులు నగలు దోచుకున్నారు. అయితే అతడిని కొట్టి గొంతునులిమి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. పోలీసుల దర్యాప్తులో భార్యే Ex.లవర్‌తో కలిసి భర్తను చంపి.. ప్రమాదంగా మలిచినట్లు తేల్చారు.
News February 5, 2026
పాపాలు, వ్యాధులను మాయం చేసే ఆలయం

MHలోని నాసిక్ జిల్లాలో 7 పర్వతాల నడుమ వెలసిన క్షేత్రం సప్తశృంగి ఆలయం. సతీదేవి కుడి చేయి పడిన ఈ ప్రదేశం 52 శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారు 10 అడుగుల ఎత్తులో, 18 చేతులతో ‘మహిషాసుర మర్దిని’గా దర్శనమిస్తారు. రాముడు, హనుమంతుడు సందర్శించిన ఈ ప్రాంతంలోని పవిత్ర తీర్థాలలో స్నానం చేస్తే పాపాలు, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని నమ్మకం. ప్రకృతి సౌందర్యం మధ్య కొలువైన అమ్మవారి దర్శనం ధైర్యన్నిస్తుంది.


