News August 31, 2024
బలప్రయోగంపై కోల్కతా CPకి NHRC నోటీసులు

కోల్కతా పోలీస్ కమిషనర్కు NHRC నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 27న ‘నబన్నా అభిజన్’ ర్యాలీలో ప్రజలపై అతి, కఠోర బలప్రయోగాన్ని ప్రశ్నించింది. ఆ రోజు ఎలాంటి చర్యలు తీసుకున్నారో 2 వారాల్లో రిపోర్టు ఇవ్వాలంది. BHIM ప్రతినిధి OP వ్యాస్ ఫిర్యాదుపై స్పందించింది. ‘200 మంది విద్యార్థులపై భౌతికదాడి చేశారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది శాంతియుతంగా గుమిగూడే హక్కును ఉల్లఘించడమే’ అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News October 22, 2025
బలి చక్రవర్తి ఎవరంటే?

బలి చక్రవర్తి రాక్షస వంశంలో జన్మించినప్పటికీ, అపార దాన గుణంతో, పరాక్రమంతో ముల్లోకాలను పరిపాలించాడు. ఈయన భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్త ప్రహ్లాదుడికి మనవడు అవుతాడు. ఆయన దాతృత్వాన్ని, అహంకారాన్ని పరీక్షించడానికి విష్ణువు వామనావతారంలో వచ్చాడు. మూడడుగుల నేలను దానంగా అడిగాడు. బలి తన సర్వస్వం దానం చేశాడు. ఈ దాన గుణాన్ని మెచ్చిన హరి పాతాళ లోకానికి బలిని చక్రవర్తిగా ఉండే వరాన్ని ప్రసాదించాడు.
News October 22, 2025
పశువుల్లో గాలికుంటు వ్యాధి ఎలా వస్తుందంటే?

వైరస్ ద్వారా వ్యాపించే గాలి కుంటువ్యాధి పశువుల్లో ప్రమాదకరమైనది. వర్షాకాలంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తడిగా ఉండే నేలపై గడ్డిమేయడం, కలుషితమైన మేత, దాణా తినడం వల్ల ఈ వైరస్ పశువులకు సోకుతుంది. ఇది అంటువ్యాధి. వైరస్, గాలి ద్వారా ఇతర పశువులకూ వ్యాపిస్తుంది. తల్లిపాల ద్వారా దూడలకు వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ వ్యాధి పశువులకు వచ్చే అవకాశం ఎక్కువ.
News October 22, 2025
శివకాశి రికార్డు.. రూ.7వేల కోట్ల బిజినెస్

దేశ బాణసంచా రాజధాని శివకాశి(TN) రికార్డు సృష్టించింది. ఈ దీపావళి సీజన్లో రూ.7వేల కోట్ల బిజినెస్ జరిగిందని, 2024 కంటే రూ.1,000 కోట్లు అధికమని ఫైర్ వర్క్ ట్రేడర్స్ అసోసియేషన్ తెలిపింది. శివకాశిలో వేల సంఖ్యలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే బాణసంచాలో 90% ఇక్కడి నుంచే సప్లై అవుతుంది. రిటైల్ మార్కెట్లో కంటే తక్కువ ధర ఉండటంతో ఇతర రాష్ట్రాల ప్రజలూ ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తారు.