News January 4, 2026
NIAలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) 5 సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 13వరకు అప్లై చేసుకోవచ్చు. LLB అర్హతతో పాటు క్రిమినల్ కేసులు వాదించడంలో కనీసం 8 ఏళ్లపాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.1,25,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nia.gov.in
Similar News
News January 5, 2026
ప్రాణాలు కాపాడుకొని.. సవాల్ విసరాలని!

మార్చి 31 నాటికి మావోయిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఎంతోమంది కీలక నేతలు మరణించగా అనేక మంది లొంగిపోయారు. ప్రస్తుతం దళంలో కొంతమందే మిగిలారు. అయితే డెడ్‌లైన్ నాటికి ప్రాణాలు కాపాడుకొని తమను నిర్మూలించలేరంటూ కేంద్రానికి సవాల్ విసరాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. తిప్పిరి తిరుపతి సారథ్యంలోని దళాలు బలగాల కంటికి చిక్కకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి.
News January 5, 2026
నల్లమలసాగర్ ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు సుప్రీంలో విచారణ

TG: ఏపీ ప్రతిపాదించిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించనుంది. అనుమతుల్లేకుండా చేపడుతున్న ఈ పనులపై బలమైన వాదనలు వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సీఎం రేవంత్ సూచించారు. అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావును విచారించేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పైనా నేడు విచారణ జరగనుంది.
News January 5, 2026
ESIC నవీ ముంబైలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


