News April 14, 2025

తహవూర్ రాణా వాయిస్ శాంపిల్స్ సేకరిస్తున్న NIA

image

ఉగ్రవాది తహవూర్ రాణా వాయిస్ నమూనాలను ఎన్ఐఏ సేకరిస్తున్నట్లు సమాచారం. ముంబైలో ఉగ్రదాడులకు కుట్ర పన్నేందుకు డేవిడ్ హెడ్లేతో రాణా మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ భారత నిఘా వర్గాల వద్ద ఉన్నాయి. వాటిలో ఉన్నది రాణా గొంతే అని ధ్రువీకరించేందుకు వాయిస్ నమూనాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అతడే అని ధ్రువీకరించిన అనంతరం భారత్ నుంచి ఆ దుశ్చర్యకు సహకరించిన మరింతమంది వివరాల్ని రాబట్టే అవకాశం ఉంది.

Similar News

News April 16, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల అకౌంట్లలో రూ.లక్ష జమ
* ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు: కిషన్ రెడ్డి
* ప్రోటోకాల్ ప్రకారమే నిపుణులతో గ్రూప్-1 వాల్యూయేషన్: TGPSC
* AP: మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: CM చంద్రబాబు
* ఈ నెల 26న మత్స్యకారుల అకౌంట్లలోకి రూ.20,000
* AP పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు
* KKRపై పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ

News April 16, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె వాయిదా

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె వాయిదా పడింది. రీజనల్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చల్లో తమకు నెల గడువు కావాలని యాజమాన్యం కోరింది. అలాగే సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ ప్రతిపాదనలను అంగీకరించిన కమిషనర్ యథాతథ స్థితి కొనసాగించాలని నిర్ణయించింది. తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలనే తదితర డిమాండ్లతో కార్మికులు సమ్మె చేయాలని భావించిన విషయం తెలిసిందే.

News April 16, 2025

ఏపీకి చేరుకున్న 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు

image

AP: 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు విజయవాడకు చేరుకున్నారు. పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం 4 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. రేపు సచివాలయంలో అమరావతి ఫొటో గ్యాలరీని వీరు తిలకించనున్నారు. అనంతరం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన సాయంపై వీరితో సీఎం, మంత్రులు రేపు చర్చిస్తారు. రాత్రి తిరుపతికి వెళ్తారు. ఎల్లుండి స్థానిక ప్రజాప్రతినిధులు, వాణిజ్య, వ్యాపారులతో భేటీ అవుతారు.

error: Content is protected !!