News April 11, 2025
రాణాను కోర్టులో హాజరుపరిచిన NIA

26/11 ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రాణాను ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో భారీ బందోబస్తు మధ్య హాజరుపరిచారు. అతడిపై UAPA కేసుల్ని నమోదు చేసిన అధికారులు, 14రోజుల కస్టడీకి రాణాను అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కేంద్రం నియమించింది.
Similar News
News April 18, 2025
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) కీలక నిర్ణయం

రిక్రూట్‌మెంట్‌లో భద్రత, పారదర్శకత పెంపొందించేందుకు SSC కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది మే నుంచి నిర్వహించబోయే పరీక్షలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, పరీక్షా కేంద్రాల వద్ద ఈ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపింది. అయితే, అభ్యర్థి తమ వెరిఫికేషన్‌ను స్వచ్ఛందంగానే చేసుకోవాలని పేర్కొంది.
News April 18, 2025
ఉక్రెయిన్ ఆరోపణలు నిరాధారం: చైనా

రష్యాకు తాము ఆయుధాలు సరఫరా చేస్తున్నామని ఉక్రెయిన్ చేసిన ఆరోపణలు నిరాధారమని చైనా స్పష్టం చేసింది. ‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మా వైఖరి చాలా క్లియర్‌గా ఉంది. సీజ్‌ఫైర్ రావాలనే మేం కోరుకుంటున్నాం. యుద్ధాన్ని త్వరగా ముగించి శాంతి చర్చలు ప్రారంభించాలని ఇరు దేశాలకూ చెబుతున్నాం. అలాంటిది రష్యాకు మేం ఎందుకు ఆయుధాలు సరఫరా చేస్తాం? అవి అర్థంలేని ఆరోపణలు’ అని పేర్కొంది.
News April 18, 2025
ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తా.. కేసులకు భయపడను: భూమన

AP: SV గోశాలలో ఆవుల మృతిపై మాట్లాడినందుకు తన మీద <<16135353>>కేసులు పెట్టడంపై<<>> టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఇలాంటి వంద కేసులు పెట్టినా తాను భయపడబోనని స్పష్టం చేశారు. ప్రభుత్వ తప్పులను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. వ్యక్తిత్వ హననం చేస్తే తాను వెనక్కి తగ్గుతాననుకుంటే అది వారి భ్రమ అని పేర్కొన్నారు. ఈ 10 నెలల కాలంలో టీటీడీ అప్రదిష్టపాలైందని విమర్శించారు.