News November 28, 2024
6 రాష్ట్రాల్లో 22 ప్రాంతాల్లో NIA దాడులు
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో NIA నేడు 6 రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా సోదాలు ఆరంభించింది. ఇందుకు స్థానిక పోలీసుల సహకారం తీసుకుంది. విదేశీ సిండికేటుతో ఇక్కడి ముఠాలకు సంబంధం ఉన్నట్టుగా భావిస్తోంది. బాలకార్మికులు, నిరుపేదలే టార్గెట్‌గా వ్యాపారం చేస్తున్నట్టు అనుమానిస్తోంది. ఏయే రాష్ట్రాల్లో దాడులు చేపట్టారో తెలియాల్సి ఉంది.
Similar News
News November 28, 2024
రిజర్వేషన్లపై సుప్రీం తీర్పుతో ‘క్రిప్టో క్రిస్టియన్ల’పై చర్చ!
ఇతర మతాల్లో చేరి రిజర్వేషన్ల కోసం హిందువులమని చెప్పుకోవడాన్ని <<14722317>>సుప్రీంకోర్టు<<>> తీవ్రంగా తప్పుబట్టడంతో దేశవ్యాప్తంగా క్రిప్టో క్రిస్టియన్లపై చర్చ జరుగుతోంది. క్రిప్టోకు సీక్రెటని అర్థం. వీరు క్రైస్తవాన్ని స్వీకరించి ఆ విశ్వాసాలనే పాటిస్తారు. ప్రభుత్వ పత్రాల్లో మాత్రం అలా మార్చుకోరు. రిజర్వేషన్లు, కోటా కోల్పోతామేమోనన్న భయంతో హిందువులుగా పేర్కొంటారు. రిజర్వేషన్లు హిందూ కులాలకు ఉండటమే ఇందుకు కారణం.
News November 28, 2024
సోదరుడి పెద్దకర్మకు హాజరైన సీఎం
AP: సీఎం చంద్రబాబు తన సోదరుడు రామ్మూర్తి నాయుడి పెద్దకర్మకు హాజరయ్యారు. నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ కర్మకాండ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు కుటుంబసభ్యులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
News November 28, 2024
నాన్నా.. నువ్వు గ్రేట్: శిండే కొడుకు ఎమోషనల్ ట్వీట్
వ్యక్తిగత లక్ష్యాలను పక్కనపెట్టి, పొత్తుధర్మం పాటించడంలో తన తండ్రి ఆదర్శంగా నిలిచారని ఏక్‌నాథ్ శిండే కొడుకు, MP శ్రీకాంత్ అన్నారు. సమాజంలోని ప్రతి వర్గం కోసం రేయింబవళ్లు శ్రమించారని పేర్కొన్నారు. ‘శివసేన అధినేతైన నా తండ్రిని చూసి గర్విస్తున్నాను. మోదీ, అమిత్‌షాపై ఆయన విశ్వాసం ఉంచారు. కూటనీతికి ఆదర్శంగా నిలిచారు. కామన్ మ్యాన్‌గా ప్రజల కోసం CM నివాసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచారు’ అని అన్నారు.