News February 21, 2025

NICE: మారుతోన్న హైదరాబాద్!

image

మన హైదరాబాద్ రంగులమయంగా మారుతోంది. గ్రేటర్‌ వ్యాప్తంగా జంక్షన్ల సుందరీకరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా కనువిందు చేసేలా కుర్చీలు, LED లైట్లు, గ్రీనరీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫ్లై ఓవర్ల పిల్లర్లకు వేసిన పెయింటింగ్ వాహనదారుల చూపు తిప్పనివ్వడం లేదు. ముఖ్యంగా సెక్రటేరియట్‌ వద్ద మరింత ఆహ్లాదరకంగా మార్చారు. నగరంలో ఏ మూలకు పోయినా జంక్షన్లు అందంగా దర్శనమిస్తున్నాయి.

Similar News

News December 8, 2025

ఇక తెలంగాణ ‘ఫ్యూచర్’ మన HYD

image

నేటి నుంచే కందుకూరులో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఇది ప్రపంచ ఆర్థిక సదస్సు ‘దావోస్’‌గా కార్యరూపం దాల్చింది. ఈ ఫ్యూచర్ సిటీలో భారీ పెట్టుబడులను ఆకర్షించి, యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆహ్వానించింది. ఇప్పటికే బ్లాక్ క్యాట్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్‌ అక్కడ పహారా కాస్తున్నాయి. ఈ సమ్మిట్‌తో ‘నిన్నటి వరకు ఒక లెక్క నేటి నుంచి మరో లెక్క’ అని సీఎం ధీమా వ్యక్తంచేశారు.

News December 8, 2025

HYD: గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం

image

ఫ్యూచర్ సిటీలో నేడు, రేపు నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం చేశారు. ఈ సమ్మిట్‌కు దేశ విదేశాలకు చెందిన పెట్టుబడుదారులు, పారిశ్రామిక వేత్తలు, ఐటీ కంపెనీల సీఈవోలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. 8వ తేది మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మిట్ ముగియనుంది.