News February 21, 2025
NICE: మారుతోన్న హైదరాబాద్!

మన హైదరాబాద్ రంగులమయంగా మారుతోంది. గ్రేటర్ వ్యాప్తంగా జంక్షన్ల సుందరీకరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా కనువిందు చేసేలా కుర్చీలు, LED లైట్లు, గ్రీనరీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫ్లై ఓవర్ల పిల్లర్లకు వేసిన పెయింటింగ్ వాహనదారుల చూపు తిప్పనివ్వడం లేదు. ముఖ్యంగా సెక్రటేరియట్ వద్ద మరింత ఆహ్లాదరకంగా మార్చారు. నగరంలో ఏ మూలకు పోయినా జంక్షన్లు అందంగా దర్శనమిస్తున్నాయి.
Similar News
News October 23, 2025
అసత్య ప్రచారానికి చెక్ పెట్టేందుకు రైల్వే ఫ్యాక్ట్ చెక్

భారత రైల్వేకు సంబంధించి అసత్య ప్రచారానికి చెక్ పెట్టేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఫ్యాక్ట్ చెక్‌ను తీసుకొచ్చింది. తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనేందుకు X హ్యాండిల్‌ను తీసుకొచ్చినట్లు పేర్కొంది. రైల్వేల గురించి తప్పుదారి పట్టించే లేదా తప్పుడు సమాచారం కనిపిస్తే <
News October 23, 2025
నెల్లూరు జిల్లాలో వర్షాలు.. ఇవి గుర్తుంచుకోండి

➤ నేటి నుంచి 3రోజులు భారీ వర్షాలు
➤ అత్యవసరమైతే ఇళ్ల నుంచి బయటకు రండి
➤ బీచ్‌లకు వెళ్లడం, చేపలవేట నిషేధం
➤ వర్షాల సమయంలో టీవీలు, ఫ్రిడ్జ్‌లు ఆపేయండి
➤వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకండి
➤కలెక్టరేట్ నంబర్: 7995576699, 08612331261
➤పోలీస్ కంట్రోల్ రూమ్: 9392903413, 9440796383, 9440796370, 100
News October 23, 2025
ఆకుకూరల్లో చీడపీడల నివారణకు సూచనలు

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఆకుకూరల పంటల్లో అనేక చీడపీడలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆకుల అడుగు బాగాన తెల్లని బొడిపెలు, పైభాగాన లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి పండు బారుతున్నాయి. వీటి నివారణకు లీటరు నీటికి కాపర్ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాముల మందును కలిపి ఆకుల అడుగు భాగం తడిసేలా పిచికారీ చేయాలి. గొంగళి పురుగులు ఆకులను కొరికి తింటుంటే లీటరు నీటికి కార్బరిల్ మందును రెండు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.