News February 21, 2025
NICE: మారుతోన్న హైదరాబాద్!

మన హైదరాబాద్ రంగులమయంగా మారుతోంది. గ్రేటర్ వ్యాప్తంగా జంక్షన్ల సుందరీకరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా కనువిందు చేసేలా కుర్చీలు, LED లైట్లు, గ్రీనరీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫ్లై ఓవర్ల పిల్లర్లకు వేసిన పెయింటింగ్ వాహనదారుల చూపు తిప్పనివ్వడం లేదు. ముఖ్యంగా సెక్రటేరియట్ వద్ద మరింత ఆహ్లాదరకంగా మార్చారు. నగరంలో ఏ మూలకు పోయినా జంక్షన్లు అందంగా దర్శనమిస్తున్నాయి.
Similar News
News February 22, 2025
ఇబ్రహీంపట్నం: ఈ నెల 24న బడుల్లో వంట బంద్

రంగారెడ్డిలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ బంద్‌కు పిలుపునిచ్చింది. గురువారం CITU ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని ఇబ్రహీంపట్నం MEOకు మెమోరాండం అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.10 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న తెలిపారు. కానీ, ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఇందుకు నిరసనగా ఈ నెల 24న బడుల్లో ‘వంట బంద్’ చేసి చలో కలెక్టరేట్‌లో పాల్గొంటామన్నారు.
News February 22, 2025
కీసరగుట్ట జాతర.. 2,000 మందితో బందోబస్తు!

కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల కోసం కట్టుదిట్టంగా భద్రతను చేపడుతున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సుమారు 2,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు CP పేర్కొన్నారు. ఆలయం వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
News February 22, 2025
HYD: బీజేపీ, బీఆర్ఎస్ బీసీ ద్రోహుల పార్టీలు: అద్దంకి

బీజేపీ, బీఆర్ఎస్ బీసీ ద్రోహుల పార్టీలు అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు సంబంధించి దేశంలో ఇంత పెద్ద ఎత్తున విప్లవం వస్తున్న క్రమంలో.. ఎందుకు బీజేపీ బీసీలకు రిజర్వేషన్ల గురించి ఆలోచించదని ప్రశ్నించారు. బీసీలకు రిజర్వేషన్లు సాధించడమే రాహుల్ గాంధీ జీవిత లక్ష్యమని వివరించారు.