News September 1, 2024
CPLలో నికోలస్ పూరన్ ఊచకోత

సీపీఎల్ 2024లో సెయింట్ కిట్స్ & నెవిస్ పాట్రియాట్స్‌పై ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ప్లేయర్ నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. 43 బంతుల్లోనే 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 97 పరుగులు చేసి తృటిలో శతకం చేజార్చుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ మైదానం నలువైపులా షాట్లు ఆడారు. పూరన్ ధాటికి ట్రిన్‌బాగో 250/4 పరుగులు చేసింది. ఇది సీపీఎల్ చరిత్రలోనే మూడో అత్యధిక స్కోరు.
Similar News
News November 25, 2025
సిరిసిల్ల: కలెక్టర్ హరిత సెలవుల పొడిగింపు

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ హరిత తన లాంగ్ లీవ్‌ను పొడిగించారు. అక్టోబరు 22న సెలవుపై వెళ్లిన ఆమె ఈనెల 24న విధులకు హాజరుకావాల్సి ఉంది. కానీ, ఆమె తన సెలవులను డిసెంబరు 12 వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. ఇక సిరిసిల్లకు ఇన్ఛార్జ్ కలెక్టర్‌గా గరిమా అగర్వాల్ విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.
.
News November 25, 2025
లిప్స్కీ LED మాస్క్

ప్రస్తుతం LED మాస్క్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇవి సౌందర్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దీంతో లిప్స్కీ LED మాస్క్ వచ్చింది. దీన్ని నోటిపై పెట్టుకొని సపోర్ట్ హ్యాండిల్‌ని పళ్లతో పట్టుకోవాలి. డివైజ్ స్విచ్ ఆన్/ ఆఫ్ బటన్స్ ఉంటాయి. వీటిని వాడటం వల్ల పెదాలపై ఉండే ముడతలు, గీతలు పోయి అందంగా మెరుస్తాయి. ఇది ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నించి చూడండి.
News November 25, 2025
ఆకుకూరల సాగుకు నేల తయారీ, ఎరువులు

ఆకుకూరల సాగు కోసం నేలను 3-4 సార్లు దున్ని చదును చేయాలి. పంటను బట్టి నేల తయారీలో ఎకరాకు 6-10 టన్నుల చివికిన పశువుల ఎరువు, 20 నుంచి 30 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 10-20 కిలోల యూరియా, పొటాష్ ఎరువులు వేసి నేలను సిద్ధం చేయాలి. తర్వాత అధిక వర్షాలకు నీరు ఇంకిపోయే విధంగా ఎత్తు మడులను, వాన నీరు నిల్వ ఉండకుండా నేలను తయారు చేసుకోవాలి. ఎత్తు మడుల వల్ల భారీ వర్షాలు కురిసినా పంటకు తక్కువ నష్టం జరుగుతుంది.


