News September 28, 2024
చరిత్ర సృష్టించిన నికోలస్ పూరన్

వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ చరిత్ర సృష్టించారు. ఒక క్యాలెండర్ ఇయర్లో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అవతరించారు. ఈ ఏడాది పూరన్ 2,059 పరుగులు చేశారు. ఈ క్రమంలో పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్(2036 రన్స్-2021)ను ఆయన అధిగమించారు. వీరిద్దరి తర్వాత అలెక్స్ హేల్స్ (1946 రన్స్-2022), జోస్ బట్లర్ (1833 రన్స్-2023) ఉన్నారు. 2022లోనూ మహ్మద్ రిజ్వాన్ (1817 రన్స్) అత్యధిక పరుగులు చేశారు.
Similar News
News November 22, 2025
CSIR-NML 67 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 22, 2025
ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. టెన్త్ పాసై 18-25 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.18,000-రూ.56,900. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 14. హైదరాబాద్ బ్యూరోలో 6, విజయవాడలో 3 ఖాళీలు ఉన్నాయి. అప్లై చేసేందుకు ఇక్కడ <
News November 22, 2025
అద్దం పగిలితే అపశకునమా?

ఇంట్లో ఉన్న అద్దం పగిలిపోతే దురదృష్టం ఏడేళ్ల పాటు పీడిస్తుందని అంటుంటారు. కానీ ఇదో అపోహ మాత్రమే. పూర్వం అద్దాలు ఖరీదుగా ఉండేవి. కేవలం కొందరే వాటిని కొనుగోలు చేయగలిగేవారు. అందుకే వీటిని జాగ్రత్తగా వాడాలని ఈ టాక్టిక్ను ఉపయోగించారు. ఇది ఆర్థిక నష్టాన్ని నివారించడానికి పూర్వీకులు వాడిన సామాజిక నియంత్రణ పద్ధతి మాత్రమే. దురదృష్టానికి, అద్దం పగలడానికి ఎలాంటి సంబంధం లేదని పండితులు చెబుతున్నారు.


