News July 21, 2024
నిఫా వైరస్.. లక్షణాలు ఇవే!

కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుంది. ‘ఫ్రూట్ బ్యాట్స్’ అనే గబ్బిలాలు వాలిన పండ్లను తీసుకోవడం ద్వారా వైరస్ మనుషుల్లోకి ప్రవేశిస్తుంది. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా కూడా ఇతరులకు వ్యాపిస్తుంది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు బొంగురు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. నిఫా సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచుతారు. ఇది కొవిడ్ కంటే డేంజర్.
Similar News
News December 28, 2025
తిరుమల భక్తులకు అలర్ట్

తిరుమలలో ఎల్లుండి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలను TTD ప్రారంభించనుంది. ఈ క్రమంలో నేటి నుంచి Jan 7 వరకు SSD టోకెన్ల జారీని రద్దు చేసింది. ఈ తేదీల్లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లు ఇవ్వరు. ఈనెల 30, 31, Jan 1 తేదీల్లో ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. టోకెన్లు లేనివారిని Jan 2 నుంచి 8 వరకు సర్వదర్శనం క్యూలైన్‌లో అనుమతిస్తారు.
News December 28, 2025
APలో ప్రముఖ ‘ఉత్తర ద్వార’ క్షేత్రాలివే!

కదిరి లక్ష్మీనరసింహస్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, మంగళగిరి పానకాల నరసింహస్వామి, అహోబిలం, ద్వారకా తిరుమల, సింహాచల పుణ్యక్షేత్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఏటా అత్యంత వైభవంగా జరుగుతాయి. వీటితో పాటు విజయవాడలోని రాఘవేంద్ర స్వామి మఠం, నెల్లూరు రంగనాయకుల స్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, శ్రీకాకుళంలోని శ్రీకూర్మం క్షేత్రాల్లోనూ గతంలో ఉత్తర ద్వార దర్శనాలు కల్పించారు.
News December 28, 2025
CAT: 99 పర్సెంటైల్ వచ్చినా సీటు కష్టమే!

IIMలలో ప్రవేశాలకు పోటీ ఎక్కువగా ఉంటుంది. ప్రవేశ పరీక్ష CATలో అసాధారణ ప్రతిభ కనబర్చాలి. కానీ ఇటీవల CATలో టాపర్లు పెరిగిపోతుండటంతో 99% పైగా పర్సెంటైల్ వచ్చినా సీట్లు రావడం లేదు. సీట్ల సంఖ్య తక్కువగా ఉండటం, టాపర్లు ఎక్కువగా ఉండటమే కారణం. CAT 2025లో 12 మందికి 100% మార్కులు, 26 మందికి 99.99, 26 మందికి 99.98% మార్కులు వచ్చాయి. ఒకప్పుడు 99.30% వస్తే సీటు దక్కేది. ఇప్పుడా పరిస్థితి లేకపోవడం గమనార్హం.


