News December 17, 2024

RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు

image

APSRTC ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లకు రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్సులు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్నప్పుడు ఈ అలవెన్సులు ఉండగా, వైసీపీ హయాంలో ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎత్తివేశారు. దాన్ని ఇప్పుడు తిరిగి అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీని వల్ల ఉద్యోగులకు నెలకు రూ.5వేల నుంచి రూ.6వేలు అదనంగా అందనున్నాయి.

Similar News

News January 1, 2026

పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత దేవా

image

TG: మావోయిస్టు పార్టీ అగ్రనేత బర్సె దేవా అలియాస్ సుక్కాను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన దేవాపై రూ.50 లక్షల రివార్డు ఉందని పోలీసులు చెబుతున్నారు. మరో 15 మంది కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వారందరినీ వెంటనే కోర్టులో హాజరుపరచాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో కలిసి దేవా గతంలో పనిచేశారు.

News January 1, 2026

పారా మెడికల్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు

image

AP: పారా మెడికల్ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలైతే ఆ సబ్జెక్టులను యాన్యువల్ ఎగ్జామ్స్‌తో పాటు మళ్లీ రాసేవారు. ఫలితంగా ఏడాదిపాటు వేచి ఉండాల్సి వచ్చి ఉపాధి అవకాశాలు కోల్పోయేవారు. కాగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో వారికి 2025-26 నుంచి తొలిసారిగా సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. FEB 2, 3, 4 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 5వ తేదీవరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

News January 1, 2026

కాఫ్ సిరప్ తయారీ, విక్రయ నిబంధనలు కఠినం

image

‘కోల్డ్రిఫ్’ కాఫ్ సిరప్‌తో MP, రాజస్థాన్‌లలో పిల్లలు మరణించడం తెలిసిందే. దీనిపై WHO హెచ్చరికతో కేంద్రం సిరప్‌ల తయారీ, విక్రయ రూల్స్ కఠినం చేస్తోంది. సిరప్ పదాన్ని షెడ్యూల్ K నుంచి తొలగించింది. కాస్మొటిక్స్‌తో పాటు కాఫ్ సిరప్‌ల తయారీ, విక్రయాలకు ఈ షెడ్యూల్ రూల్స్ వర్తించేవి. ఇకపై ఇతర డ్రగ్స్ కేటగిరీలోకి ఇవి చేరనున్నాయి. ప్రిస్క్రిప్షన్‌‌పైనే విక్రయించాలని కేంద్రం స్పష్టం చేసింది.