News May 4, 2024
నిజ్జర్ హత్య.. ఆ ముగ్గురూ భారతీయులే?
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ముగ్గురూ భారతీయులని పేర్కొంటూ వారి ఫొటోలను రిలీజ్ చేసింది. నిందితులు కరణ్ బ్రార్ (22), కమల్ప్రీత్ సింగ్ (22), కరణ్ప్రీత్ సింగ్ (28)గా పేర్కొంది. వీరికి భారత ప్రభుత్వానికి సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. కాగా నిజ్జర్ హత్య వెనుక భారత్ ఉందని కెనడా ఆరోపిస్తోంది.
Similar News
News December 29, 2024
నేడు ప్రో కబడ్డీ లీగ్ ఫైనల్
ప్రో కబడ్డీ లీగ్-2024 ఫైనల్ నేడు జరగనుంది. హరియాణా స్టీలర్స్, పట్నా పైరెట్స్ తుది సమరంలో తలపడనున్నాయి. రా.8 గంటలకు మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో నం.1గా ఉన్న హరియాణా తొలి సారి ట్రోఫీని ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు మూడుసార్లు విజేతగా నిలిచిన పట్నా నాలుగో టైటిల్పై కన్నేసింది.
News December 29, 2024
వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్గా తెలుగు తేజం
వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్ విజేతగా తెలుగు తేజం కోనేరు హంపి నిలిచారు. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లారు. ఇండోనేషియా ప్లేయర్ ఇరెనె సుఖందర్పై ఆమె విజయం సాధించారు. 2019లోనూ ఆమె విజేతగా నిలిచారు. దీంతో చైనా గ్రాండ్ మాస్టర్ జు వెంజన్ తర్వాత ఎక్కువ సార్లు టైటిల్ గెలుచుకున్న ప్లేయర్గా హంపి రికార్డులకెక్కారు. మెన్స్ విభాగంలో రష్యా ప్లేయర్ మర్జిన్ టైటిల్ గెలిచారు.
News December 29, 2024
సంక్రాంతికి 5వేల ప్రత్యేక బస్సులు
TG: సంక్రాంతి పండుగకు 5వేల ప్రత్యేక బస్సుల్ని నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఏయే రూట్లలో ఇవి నడుస్తాయి? ఛార్జీలు ఎలా ఉంటాయి? తదితర ప్రశ్నలపై అధికారులు త్వరలో స్పష్టతనివ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని జిల్లాలతో పాటు ఏపీకి నడిపే సర్వీసులు కూడా వీటిలో ఉంటాయని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. జనవరి మొదటి వారం నుంచి 10 రోజుల పాటు ఈ బస్సులు నడుస్తాయని తెలిపాయి.