News December 12, 2024

నిఖేశ్ అక్రమార్జన రోజుకు రూ.2 లక్షలు!

image

TG: నీటిపారుదలశాఖ AEE నిఖేశ్ కుమార్ అక్రమార్జన కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆయన అక్రమార్జన రోజుకు ₹.2లక్షలకు పైమాటేనని అధికారులు అంచనా వేస్తున్నారు. జాబ్‌లో చేరిన 10ఏళ్లలోనే ₹.100కోట్లు కూడబెట్టారని సమాచారం. ఒక్కో ఫైల్‌కే ఆయన ₹.50లక్షల లంచం తీసుకున్నట్లు తెలుస్తోంది. FTL, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాల కోసం ఆయన లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చారని, ఈ కేసులో ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు సమాచారం.

Similar News

News December 12, 2024

సినీ నటుడు మోహన్ బాబుపై మరో ఫిర్యాదు

image

మీడియాపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మంచు విష్ణు నటిస్తున్న ఓ మూవీ ప్రమోషన్ల కోసమే వారు డ్రామా ఆడుతున్నారు. మోహన్ బాబుతోపాటు ఆయన కుమారులు విష్ణు, మనోజ్‌పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి’ అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే.

News December 12, 2024

‘సరస్వతి’ భూములు వెనక్కి తీసుకున్న సర్కార్

image

AP: సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు చెందిన అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు పల్నాడు జిల్లా మాచవరం తహశీల్దార్ ఎం.క్షమారాణి తెలిపారు. మొత్తం 17.69 ఎకరాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 3.89 ఎకరాలను ప్రభుత్వం తిరిగి తీసుకుంది. వేమవరం, చెన్నాయపాలెం, పిన్నెల్లి గ్రామాల పరిధిలో సరస్వతి కంపెనీకి దాదాపు 2 వేల ఎకరాల భూములు ఉన్నట్లు తెలుస్తోంది.

News December 12, 2024

నాగార్జున పరువు నష్టం పిటిషన్‌పై విచారణ

image

TG: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. సురేఖ తరఫున ఆమె లాయర్ కోర్టుకు హాజరయ్యారు. మంత్రి హాజరుకావడానికి మరో డేట్ ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ఈనెల 19కి కోర్టు వాయిదా వేసింది.