News November 23, 2024
నిఖిల్ కుమారస్వామి ఓటమి

కర్ణాటక రాష్ట్రం చన్నపట్న అసెంబ్లీ బైపోల్లో నిఖిల్ కుమారస్వామి ఓటమి చెందారు. జనతాదళ్(సెక్యులర్) నుంచి బరిలో దిగిన ఆయన 25,413 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీపీ యోగీశ్వర గెలుపొందారు. కొన్ని రౌండ్లలో ఆధిక్యం కనబరిచిన నిఖిల్ చివరకు భారీ తేడాతో పరాజయం చెందారు. కేంద్రమంత్రి HD కుమారస్వామి కుమారుడైన నిఖిల్ ‘జాగ్వార్’ మూవీలో హీరోగా నటించిన విషయం తెలిసిందే.
Similar News
News January 16, 2026
మెగ్నీషియంతో జుట్టుకు మేలు

వయసుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. దీనికోసం పైపైన ఎన్ని షాంపూలు, నూనెలు వాడినా ఉపయోగం ఉండదంటున్నారు నిపుణులు. మెగ్నీషియం లోపం వల్ల మాడుకు రక్త ప్రసరణ తగ్గడంతో పోషకాలు అందక జుట్టు సమస్యలు వస్తాయి. పాలకూర, గుమ్మడి గింజలు, బాదం, అవిసెగింజలు, చియా, బీన్స్, చిక్కుళ్లు, అరటి, జామ,కివీ, బొప్పాయి, ఖర్జూరాలు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News January 16, 2026
ప్రభాస్ ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ వచ్చేసింది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న ‘స్పిరిట్’ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 8 భాషల్లో రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచిన విషయం తెలిసిందే.
News January 16, 2026
గాదె ఇన్నయ్యకు 48 గంటల బెయిల్

TG: ఉపా కేసులో అరెస్టైన మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకు బెయిల్ లభించింది. తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నాంపల్లి NIA కోర్టు 48 గంటల బెయిల్ మంజూరు చేసింది. HYDలోని చంచల్గూడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. నిన్న రాత్రి ఇన్నయ్య తల్లి థెరిసమ్మ జనగామ జిల్లా జఫర్గఢ్లో కన్నుమూశారు. రేపు ఆమె అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.


