News October 6, 2024
దీపావళికి నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’

సుధీర్ వర్మ డైరెక్షన్‌లో నిఖిల్ హీరోగా నటిస్తున్న మూవీ అప్డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. ఆ చిత్రానికి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టైటిల్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ దీపావళికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూవీలో రుక్మిణీ వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Similar News
News March 28, 2026
చిరంజీవి గొప్ప మనసు.. అవార్డు డబ్బు విరాళంగా

చిరంజీవి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల ప్రభుత్వం అందించిన ‘NTR జాతీయ పురస్కారం’తో పాటు వచ్చిన ₹10 లక్షలను ఆయన స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. సర్వ్, దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్, వాల్మీకి, నయశ్రీ ఫౌండేషన్లతో పాటు క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ చిన్నారి చికిత్స కోసం బసవతారకం ఆసుపత్రికి ఈ సాయం అందించారు. శుక్రవారం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం విశేషం.
News March 28, 2026
యుద్ధం ఇంకొన్ని వారాలే: అమెరికా

పశ్చిమాసియా యుద్ధం కొన్నివారాల్లోనే ముగియనుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మిలిటరీ యాక్షన్స్ అనుకున్న సమయం కంటే వేగంగానే టార్గెట్‌ను రీచ్ అవుతున్నాయని, ఈ యుద్ధం నెలల తరబడి కొనసాగదని స్పష్టం చేశారు. ఈ పోరాటంలోకి అమెరికా గ్రౌండ్ ఫోర్సెస్‌ను రంగంలోకి దించాల్సిన అవసరం లేదని, వ్యూహాత్మక చర్యలతోనే శత్రువును దెబ్బకొడతామని వెల్లడించారు.
News March 28, 2026
కొలెస్ట్రాల్ నార్మల్ ఉన్నా గుండెపోటు ముప్పు

చాలామంది బ్లడ్ టెస్టుల్లో కేవలం HDL, LDL మాత్రమే చూసుకుంటారు. అయితే కొలెస్ట్రాల్ నార్మల్ ఉన్నా గుండెపోటు రావడానికి లిపోప్రోటీన్(a) లేదా Lp(a) ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది జన్యుపరంగా వస్తుంది కాబట్టి ఆహారం, వ్యాయామంతో సంబంధం లేకుండా పుట్టుకతోనే శరీరంలో స్థిరంగా ఉంటుంది. ఇది రక్తనాళాల్లో పూడికలు, రక్తం గడ్డకట్టే రిస్క్‌ను పెంచుతుంది. భారతీయులలో ఈ ముప్పు మరీ ఎక్కువ.


