News April 7, 2025
NIMSలో సోలార్ కరెంట్‌తో డయాలసిస్ సేవలు..!

HYD NIMS ఆసుపత్రిలో డయాలసిస్ రోగులకు ఇకపై సౌర విద్యుత్తుతో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రాజెక్ట్ గ్రీన్ డయాలసిస్ ఇనిషియేటివ్ పేరుతో రోజుకు 200 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దీని ద్వారా పర్యావరణ హితంగా, నిరాటంకంగా డయాలసిస్ సేవలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News April 9, 2025
చివరికి న్యాయమే గెలిచింది: మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా

చివరికి న్యాయమే గెలిచిందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తెలిపారు. తన సోదరుడు అంజద్ బాషా కడపలోని సెంట్రల్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా అంజాద్ అంజద్ బాషా మాట్లాడారు. చివరి వరకు న్యాయస్థానాన్ని నమ్మామన్నారు. న్యాయమే గెలిచి నా సోదరుడు అహ్మద్ అంజద్ బాషాకి బెయిల్ వచ్చిందన్నారు. కష్టకాలంలో తోడున్న వైసీపీ కార్యకర్తలకి, ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
News April 9, 2025
బంగ్లాదేశ్‌కు భారత్ దెబ్బ

బంగాళాఖాతానికి తామే పరిరక్షకులం అని బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ చైనాలో చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ దేశానికి ఉన్న ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌకర్యాన్ని రద్దు చేసింది. దీంతో బంగ్లాదేశ్ తమ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ఇక నుంచి భారత రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలను వినియోగించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా పోటీ తగ్గి భారత ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరనుంది.
News April 9, 2025
కేంద్ర మంత్రి మాంఝీ మనవరాలి హత్య

కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మ హత్యకు గురయ్యారు. బిహార్‌లోని గయాలో భర్త రమేశ్ నాటు తుపాకీతో ఆమెను కాల్చి చంపాడు. నిన్న రాత్రి ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దంపతుల మధ్య తలెత్తిన గొడవలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి ఇంకా స్పందించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.