News February 25, 2026

NIMSలో CMRF ద్వారా రూ.521 కోట్ల విలువచేసే వైద్యం

image

పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో సీఎంఆర్ ఫండ్ ద్వారా అనేకమందికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని డైరెక్టర్ బీరప్ప తెలిపారు. 2 సంవత్సరాల్లో ఎల్‌ఓసీల ద్వారా రూ.521 కోట్లకు పైగా విలువైన చికిత్సలు అందించినట్లు వెల్లడించారు. వెన్నెముక శస్త్రచికిత్సలు సైతం నిర్వహించామని, ముఖ్యంగా న్యూరో సర్జరీ కేసులు 2,221 నమోదైనట్లు పేర్కొన్నారు. పేద రోగులకు ఇది గొప్ప ఉపశమనం కలిగిస్తున్నట్లు వివరించారు.

Similar News

News February 28, 2026

కామారెడ్డి: శాంతి భద్రతల లోపం స్పష్టంగా కనిపిస్తోంది: ఏలేటి

image

కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కామారెడ్డిలో చోటుచేసుకున్న ఘటనలు, బాన్సువాడ, నాగర్ కర్నూల్‌లో భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే పట్టించుకోవడం లేదన్నారు. కామారెడ్డి ఘటనకు కారకులైన వారిని అరెస్టు చేయకుండా MLAపై దాడికి యత్నించిన వ్యక్తిని అడ్డుకున్న కార్యకర్తలను అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు.

News February 28, 2026

వచ్చే మూడేళ్లలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాజెక్టులు పూర్తి: సీఎం

image

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని పెండింగ్‌లో ఉన్న తాగునీటి ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రావివలస ప్రజా వేదికలో ఆయన మాట్లాడారు. పోలవరం నుంచి సుజల స్రవంతి ద్వారా విశాఖకి త్వరలోనే నీరు అందిస్తామన్నారు. వంశధార, నాగావళి, చంపావతి నదులను గోదావరితో అనుసంధానం చేస్తామన్నారు.

News February 28, 2026

నల్గొండ: నేడే ఆఖరు.. 2.42 లక్షల మంది పెండింగ్

image

జిల్లాలోని రైతులకు ప్రభుత్వం అందించే పథకాలు అందాలంటే తప్పనిసరిగా చేసుకోవాల్సిన ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ గడువు నేటితో ముగియనుంది. జిల్లా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు కేవలం 55.06 శాతం మంది రైతులు మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 5,39,619 మంది రైతులు ఉండగా, ఇంకా 2,42,492 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. మునుగోడు మండలంలో మాత్రమే అత్యధికంగా (70.22%) నమోదైంది.