News June 7, 2024
ఏపీ సీఎస్గా నీరభ్ కుమార్?

AP: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ IAS అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ పేరు <<13390605>>తెరపైకి<<>> వచ్చింది. 1987 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చంద్రబాబును నీరభ్ కుమార్ నిన్న మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. ఆయన నియామకంపై ఇవాళ జీవో రావొచ్చనే చర్చ నడుస్తోంది. ప్రస్తుత CS జవహర్ రెడ్డి ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు.
Similar News
News November 17, 2025
రేపు భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు రాష్ట్రంలో చలి తీవ్రరూపం దాల్చింది. సా.6 తర్వాత బయటికి రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు.

ఆటోడ్రైవర్ల సమస్యలపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు: KTR

TG: ఆటోడ్రైవర్ల సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫైరయ్యారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రెన్యూవల్ చేయకపోవడంతో బీమా సౌకర్యం కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని 5 వేల మంది ఆటోడ్రైవర్లకు ప్రమాద బీమా తానే కడతానని పేర్కొన్నారు.