News June 7, 2024
AP CSగా నీరభ్ కుమార్ బాధ్యతలు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ వెలగపూడి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. TTD, విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన సీఎస్ కుర్చీలో ఆశీనులయ్యారు. స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, జీఏడీ కార్యదర్శి సురేశ్ కుమార్ సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Similar News
News October 17, 2025
కంచుకోటలు ఖాళీ అవుతున్నాయి!

బస్తర్, అబూజ్మడ్.. మావోయిస్టులకు కంచుకోటలు. ఎన్నో భీకర ఎన్కౌంటర్లకు వేదికలు. కానీ ఇప్పుడు అక్కడ తుపాకీ మూగబోతోంది. నక్సలిజాన్ని నిర్మూలించేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో వందల మంది మావోలు మరణించారు. దిక్కుతోచని స్థితిలో అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లాంటివారు కూడా లొంగిపోయారు. అబూజ్మడ్, నార్త్ బస్తర్ మావోరహిత ప్రాంతాలుగా మారాయని, ఇక మిగిలింది దక్షిణ బస్తరేనని అమిత్ షా ప్రకటించారు.
News October 17, 2025
వేంకటేశ్వరుడే మనకు రక్షకుడు

వేంకటాచల మాహాత్మ్యం ‘కలౌ వేంకటో నాయకః’ అని పేర్కొంది. అంటే.. కలియుగంలో వేంకటేశ్వరుడే మనకు రక్షకుడు అని అర్థం. ఆయన ఈ లోకంలోని మన పాపాలను కడగడానికి, కష్టాలనే భవసాగరంలో మునిగిపోతున్న జీవులను ఉద్ధరించి, వారికి మోక్షాన్ని ప్రసాదించడానికి తిరుమలలో వేంకటపతిగా స్వయంగా వెలిశారు. ఆయన దివ్య దర్శనం మాత్రమే మనకు శ్రేయస్సును, ఉత్తమ గతిని అనుగ్రహిస్తుంది. అందుకే ఈ కలియుగానికి ఆయనే ఏకైక నాయకుడు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News October 17, 2025
అది కల్తీ మద్యమే: ల్యాబ్ నివేదిక

AP: NTR(D) ఇబ్రహీంపట్నంలో జనార్దన్రావు విక్రయించిన మద్యం కల్తీదే అని తేలింది. అది అత్యంత ప్రమాదకరమైంది కాకపోయినా నిబంధనల ప్రకారం ఉండాల్సిన ప్రమాణాలు లేవని ల్యాబ్ రిపోర్ట్స్ తేల్చాయి. 25గా ఉండాల్సిన UP(అండర్ ప్రూఫ్) 35గా, అలాగే 75గా ఉండాల్సిన OP(ఓవర్ ప్రూఫ్)65గా ఉన్నట్లు గుర్తించాయి. మద్యం తయారీలో నాణ్యత, గాఢతలను UP, OP తెలియజేస్తాయి. ఈ కేసులో ఇప్పటికే జనార్దన్రావు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.