News August 17, 2024
మమతపై నిర్భయ తల్లి ఆగ్రహం

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోకుండా సీఎం మమతా బెనర్జీ ధర్నాకు దిగడంపై నిర్భయ తల్లి ఆశాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మమతా పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలకు భద్రత ఏ స్థాయిలో ఉందో ఈ ఘటనతో అర్థమవుతోందన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆశాదేవి కోరారు.
Similar News
News January 23, 2026
కల్తీనెయ్యి కేసులో CBI ఫైనల్ ఛార్జిషీట్

తిరుమల శ్రీవారి లడ్డూల్లో కల్తీనెయ్యి వ్యవహారంపై CBI నెల్లూరు కోర్టులో తుది ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇప్పటికే 24 మందిని నిందితులుగా చేర్చగా, మరో 12 మందిని ఇందులో చేరుస్తూ ఇవాళ అభియోగపత్రం దాఖలు చేసింది. ఛార్జిషీట్లో 11 మంది TTD ఉద్యోగులు, మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న సహా AR డెయిరీ, భోలేబాబా డెయిరీకి చెందిన కీలక వ్యక్తుల పేర్లున్నాయి.
News January 23, 2026
ఉద్యోగంలో ఎదగాలంటే..?

వృత్తి ఉద్యోగాల్లో రాణించి ఉన్నత స్థానాలకు వెళ్లాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. మీ రంగంలో ఎంత అనుభవం ఉన్నా మీ రంగంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. అలాగే ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేయడం నేర్చుకోవాలి. టార్గెట్లు పెట్టుకోండి. వాటిని చేరే విధంగా ఆలోచనలు, పనులు ఉండాలి. సహోద్యోగులతో ఆరోగ్యకరమైన పోటీ ఉండేలా చూసుకోవాలి.
News January 23, 2026
ఒక్కరోజులో 5.38 లక్షల మంది విమానయానం

దేశీయ విమానయానంలో 2025 NOV 23వ తేదీ రికార్డు సృష్టించింది. ఈ ఒక్కరోజే 5,38,249 మంది ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించారు. 3,356 విమానాలు దేశంలో రాకపోకలు సాగించాయి. గత 3 ఏళ్లలో రోజువారీ 5 లక్షల మందికి పైగా ప్రయాణించిన సందర్భాలున్నాయని విమానయాన శాఖ పేర్కొంది. కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటు, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి చోట్ల రీజనల్ కనెక్టివిటీ పెరగడం దీనికి కారణంగా వివరించింది.


