News August 14, 2024

NIRF 2024లో NIT-వరంగల్‌కి స్థానం

image

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ(MOE) విడుదల చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(NIRF) 2024లో NIT-వరంగల్ స్థానం సంపాదించింది. ఇంజినీరింగ్ కేటగిరీలో 21వ ర్యాంక్ సాధించిందని డైరెక్టర్ బిద్యధర్ సుబుధి ఓ ప్రకటనలో తెలిపారు. ఓవరాల్ కేటగిరీలో 53వ ర్యాంక్ పొందిందన్నారు. మేనేజ్‌మెంట్ విభాగంలో మొదటిసారి పాల్గొని 100వ ర్యాంక్‌ను పొందిందని వారు పేర్కొన్నారు.

Similar News

News September 17, 2024

MHBD: బ్రెయిన్ ట్యూమర్‌తో యువతి మృతి

image

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ.. యువతి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని గాంధీనగర్‌కు చెందిన హరిదాస్యపు వైష్ణవి(24) బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో గత కొద్ది రోజులుగా బాధపడుతోంది. కాగా, చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 17, 2024

హనుమకొండ: జాతీయ జెండా ఎగురవేయనున్న కొండా సురేఖ

image

హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా మంగళవారం హాజరవుతున్నారు. నేడు ఉదయం 9:48 నిమిషాలకు అదాలత్ కూడలిలోని అమరవీరుల స్తూపానికి పూలతో అంజలి ఘటించి నివాళులు అర్పించనున్నారు. అనంతరం 10 గంటలకు హనుమకొండ కలెక్టరేట్‌కు చేరుకొని జాతీయ జెండా ఎగరవేస్తారు.

News September 17, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> MLG: వితంతు మహిళపై అత్యాచారం… బాధిత కుటుంబం నిరసన
> JN: నిమజ్జనంలో అపశ్రుతి..
> HNK: గంజాయి తరలిస్తుండగా.. అరెస్టు
> JN: సీత్యా తండాలో పీడీఎస్ బియ్యం పట్టివేత..
> MLG: ఆదివాసీ విద్యార్ధి సంఘం మాజీ అధ్యక్షుడు మృతి..
> MHBD: బ్రెయిన్ ట్యూమర్ తో యువతి మృతి..
> JN: డ్రగ్స్ పై ప్రజలకు అవగాహన సదస్సు..