News January 31, 2025
8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్ శనివారం లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమె వరుసగా ప్రవేశపెట్టనున్న 8వ బడ్జెట్ కావడం విశేషం. స్వతంత్ర భారత్లో మొదటి బడ్జెట్ను Nov 26, 1947న తొలి ఆర్థిక మంత్రి RK షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టారు. అయితే భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు బ్రిటిష్ కాలంలో MP James Wilson మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టారు.
Similar News
News October 15, 2025
ఆస్ట్రేలియా అంటే వీరికి పూనకాలే..

ఆస్ట్రేలియాపై వన్డేల్లో విరాట్, రోహిత్లకు మంచి రికార్డులు ఉన్నాయి. అత్యధిక రన్స్ చేసిన లిస్టులో సచిన్, కోహ్లీ, రోహిత్ టాప్-3లో ఉన్నారు. సచిన్ 71 ఇన్నింగ్సుల్లో 3,077 రన్స్, 9 సెంచరీలు చేశారు. కోహ్లీ 50 ఇన్నింగ్సుల్లో 2,451, రోహిత్ 46 ఇన్నింగ్సుల్లో 2,407 పరుగులు చేశారు. విరాట్, హిట్మ్యాన్ చెరో 8 సెంచరీలు బాదారు. OCT 19 నుంచి ప్రారంభమయ్యే సిరీస్లోనూ RO-KO రాణించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
News October 15, 2025
జోగి రమేశ్ అరెస్టుకు రంగం సిద్ధం?

AP: కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి <<17996336>>జోగి రమేశ్<<>> అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యం తయారీకి ప్రోత్సహించింది రమేశే అని A-1 జనార్దన్ రావు చెప్పడంతో ఎక్సైజ్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. మద్యం పట్టుబడిన ANR గోడౌన్ పరిసరాల సీసీ ఫుటేజిని పరిశీలించారు. కాగా జనార్దన్ రావుతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని జోగి రమేశ్ స్పష్టం చేశారు.
News October 15, 2025
ఏపీ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

ఏపీ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ఎన్టీఆర్ జిల్లా నుంచి 20 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 22 వరకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://ntr.ap.gov.in/