News May 19, 2024

మెట్రోలో నిర్మలా సీతారామన్‌‌కు చేదు అనుభవం?

image

ఢిల్లీ మెట్రో రైలులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. మెట్రోలో ప్రయాణిస్తున్నంతసేపు ప్రయాణికులెవరూ ఆమె కూర్చునేందుకు సీటు ఇవ్వలేదు. దీంతో ఆమె నిల్చునే ప్రయాణం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మంత్రికి కనీస గౌరవం ఇవ్వకపోవడం దారుణమని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సమాజం ఎటు పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 18, 2025

ప్రభుత్వంపై విమర్శలు.. 65 ఏళ్ల మహిళకు 30 ఏళ్ల జైలు శిక్ష

image

వెనిజులాలో నికోలస్ మదురో ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై అక్కడి కోర్టు ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా వాట్సాప్ ఆడియో మెసేజ్‌లో నికోలస్‌ను విమర్శించిన మార్గీ ఒరోజ్కో అనే 65 ఏళ్ల వైద్యురాలికి ఏకంగా 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆమెపై రాజద్రోహం, ద్వేషాన్ని ప్రేరేపించారనే నిందలు మోపింది. కాగా ప్రస్తుతం వెనిజులాలో 882 మంది రాజకీయ ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నట్లు ఓ NGO వెల్లడించింది.

మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

image

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు-మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు అగ్రనేతలున్నట్లు సమాచారం. టైగర్ జోన్‌లో కూంబింగ్ కొనసాగుతోంది. ఏపీ-ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు.