News February 1, 2025
చరిత్ర సృష్టించనున్న నిర్మల
2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ నేడు 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరుసగా అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా చరిత్రకెక్కనున్నారు. ఇక మొత్తంగా ఎక్కువ బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన రికార్డు మాజీ పీఎం మొరార్జీ దేశాయ్(10సార్లు) పేరిట ఉంది. ప్రస్తుత కేంద్ర సర్కారుకు ఇంకో నాలుగేళ్ల గడువు ఉండటంతో ఆ రికార్డునూ నిర్మల దాటేందుకు మున్ముందు అవకాశం ఉంది.
Similar News
News February 1, 2025
కాసేపట్లో మంత్రులతో CM అత్యవసర భేటీ
TG: సీఎం రేవంత్ కాసేపట్లో మంత్రులతో అత్యవసరంగా సమావేశం కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరగనున్న ఈ భేటీలో ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికలతో పాటు ప్రభుత్వ, పార్టీ అంతర్గత వ్యవహారాలు, తాజా రాజకీయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అధికారులెవరూ ఈ మీటింగ్‌కు రావొద్దని ఆదేశించినట్లు సమాచారం.
News February 1, 2025
బడ్జెట్‌కు క్యాబినెట్ ఆమోదం
2025-26 బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంటు భవనంలో సమావేశమైన క్యాబినెట్ పద్దుకు ఆమోదముద్ర వేసింది. ఉ.11 గంటలకు ఆర్థికమంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీయే మూడో టర్మ్‌లో ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్.
News February 1, 2025
రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ 60% పూర్తి
AP: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. ఉ.10 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 60% పంపిణీ పూర్తయింది. ఉదయం పింఛన్ల పంపిణీ ప్రారంభించిన కాసేపటికే సర్వర్‌లో సమస్య తలెత్తడంతో కాసేపు ఇబ్బందులు ఎదురయ్యాయి. సమస్య పరిష్కారం అవడంతో ఎలాంటి అంతరాయం లేకుండా పెన్షన్లను అందజేస్తున్నారు. కాసేపట్లో అన్నమయ్య(D) మోటుకట్లలో సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.