News July 23, 2024

బడ్జెట్ కోసం నిర్మలమ్మ ప్రత్యేక చీరకట్టు!

image

ఆర్థిక మంత్రిగా ఏడోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ ఈసారి వైట్, మెజెంటా కలర్ శారీ ధరించారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో తాను ధరించే చీరలో ప్రత్యేకత ఉండేలా ఆమె చూసుకుంటారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా, హుందాతనాన్ని తెలియజేసేలా ఆమె చీరలు ధరిస్తారు. 2019 నుంచి ఆమె బడ్జెట్లు ప్రవేశపెడుతున్నారు.

Similar News

News January 26, 2025

సైఫ్ అలీఖాన్‌పై దాడి.. మరో ట్విస్ట్!

image

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు మరో మలుపు తీసుకుంది. ఈ నెల 15న సైఫ్ ఇంట్లోకి చొరబడిన నిందితుడు ఆయనపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అనంతరం సైఫ్ నివాసంలో 19 సెట్ల వేలిముద్రల్ని క్లూస్ టీమ్ సేకరించగా, వాటిలో ఒక్కటి కూడా నిందితుడు షరీఫుల్ ఇస్లామ్ వేలిముద్రలతో సరిపోలేదు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ముంబై పోలీసులు మరోమారు ఘటనాస్థలాన్ని, సాక్ష్యాధారాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

News January 26, 2025

ఒత్తిడి వల్లే పరుగులు చేయలేకపోతున్నా: గిల్

image

రెడ్ బాల్ క్రికెట్‌లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలని తనపై తాను ఒత్తిడి పెట్టుకుంటున్నట్లు శుభ్‌మన్ గిల్ తెలిపారు. దాని వల్లే కొన్నిసార్లు ఏకాగ్రతను కోల్పోయి ఔట్ అవుతున్నట్లు చెప్పారు. కర్ణాటకVSపంజాబ్ రంజీ మ్యాచులో సెంచరీ చేసిన గిల్, ఇటీవల జరిగిన BGTలో విఫలమైన సంగతి తెలిసిందే. 6 ఇన్నింగ్స్‌లలో 18.60 సగటుతో కేవలం 93 ​​పరుగులు చేశారు. దీంతో అతడిపై విమర్శలొచ్చాయి.

News January 26, 2025

వర్సిటీల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: సీఎం

image

TG: రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు పదేళ్లు పాలించే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు CM రేవంత్ తెలిపారు. డా.అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో మాట్లాడుతూ వర్సిటీల పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. VCలుగా అన్ని సామాజిక వర్గాల వారు ఉండాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వర్సిటీల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వీసీలను ఆదేశించారు. UGC ద్వారా వీసీల నియామకాలు చేపట్టాలని కేంద్రం కుట్ర చేస్తోందన్నారు.