News March 28, 2025
నితిన్ ‘రాబిన్‌హుడ్’ రివ్యూ&రేటింగ్

అనాథలను ఆదుకునేందుకు హీరో దొంగగా మారడమే రాబిన్‌హుడ్ స్టోరీ. నితిన్, శ్రీలీల నటన బాగుంది. వెన్నెల కిశోర్, రాజేంద్రప్రసాద్ కామెడీ వర్కౌట్ అయింది. చివర్లో ట్విస్టులు లేకపోవడంతో సినిమాను రక్తి కట్టించలేకపోయారు డైరెక్టర్ వెంకీ. మొదట్లో పవర్‌ఫుల్‌గా కనిపించే విలన్ క్యారెక్టర్ చివర్లో తేలిపోతుంది. పార్ట్-2 కోసమే డేవిడ్ వార్నర్ పాత్రను క్రియేట్ చేసినట్లు అనిపిస్తుంది. సాంగ్స్ మైనస్.
రేటింగ్- 2.5/5
Similar News
News November 15, 2025
ఏరో ఇంజిన్ రాజధానిగా తెలంగాణ: శ్రీధర్ బాబు

TG: ఏరో ఇంజిన్ రాజధానిగా తెలంగాణను తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలదే కీలక పాత్ర అని చెప్పారు. ఇప్పటికే 25కు పైగా ‘A&D’ సంస్థలు, 1500కు పైగా MSMEలు ‘TG బ్రాండ్’ను విస్తరించాయని చెప్పారు. ₹800 CRతో JSW డిఫెన్స్ ‘UAV మాన్యుఫ్యాక్చరింగ్ UNIT’, ₹500 CRతో ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ డిఫెన్స్ ఫెసిలిటీ వస్తున్నాయన్నారు.
News November 15, 2025
తిప్పేస్తున్న జడేజా.. 6 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. రెండో ఇన్నింగ్సులో RSA 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 4 వికెట్లతో సత్తా చాటారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 45 పరుగుల లీడ్‌లో ఉంది. ఇవాళ మరో 17 ఓవర్ల ఆట మిగిలి ఉంది.
News November 15, 2025
రాజకీయాలు, కుటుంబానికి గుడ్‌బై: లాలూ కూతురు

బిహార్ మాజీ సీఎం, RJD పార్టీ ప్రెసిడెంట్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలతో పాటు కుటుంబంతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. సంజయ్ యాదవ్, రమీజ్ పార్టీ నుంచి వెళ్లిపోమని తనతో చెప్పారని, మొత్తం నింద తానే తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో రోహిణి తన తండ్రి లాలూకు కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే.


