News December 31, 2024

టెస్టుల్లో హార్దిక్ కంటే నితీశ్ బెటర్: గవాస్కర్

image

టెస్ట్ ఫార్మాట్‌లో బ్యాటింగ్ విషయంలో హార్దిక్ పాండ్య కంటే నితీశ్ కుమార్ రెడ్డి బెటర్ అని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆడిన అనుభవం ఎక్కువగా లేనప్పటికీ అతను అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు. బ్యాటింగ్‌లో అతను హార్దిక్ కంటే బెటర్‌గా ఉన్నారని, బౌలింగ్‌ను మెరుగుపరచుకోవాల్సి ఉందని చెప్పారు. ఆంధ్రా క్రికెట్ టీమ్ తరఫున నితీశ్ ఇప్పటివరకు 27 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడారు.

Similar News

News February 11, 2026

లోక్‌సభలో రగడ.. అసలు రాహుల్ ఏమన్నారంటే?

image

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రస్తావన తేవడం రాజకీయ దుమారం రేపింది. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేరున్న పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అసలు ఎప్‌స్టీన్‌కు అనిల్‌ను పరిచయం చేసిందెవరో కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురికి తెలుసు’ అని రాహుల్ వ్యాఖ్యానించడంతో బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది.

News February 11, 2026

MLAల ప్రసంగాలు వింటా.. మంత్రుల సమాధానాలు చూస్తా: CBN

image

AP: 20నెలల కూటమి పాలనలో విభేదాలు లేవని CM CBN అన్నారు. ‘మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. నిబద్ధత లేకపోతే ఫలితాలు రావు. పెండింగ్ పనులను నా దృష్టికి తీసుకురండి. జిల్లాల వారీగా నేతలు, అధికారులతో సమావేశం పెడతా. అసెంబ్లీ సమావేశాలను సీరియస్‌గా తీసుకోవాలి. 9am-1pm వరకు సభ్యులంతా సభలో ఉండాలి. MLAల ప్రసంగాలు వింటా..మంత్రుల సమాధానాలు చూస్తా. అసెంబ్లీని నేను కూడా పూర్తిగా గమనిస్తా’ అని CM చెప్పారు.

News February 11, 2026

శివరాత్రి స్పెషల్.. RTC బస్సు ఛార్జీల పెంపు

image

శివరాత్రి సందర్భంగా TGSRTC 2,243 స్పెషల్ బస్సులు నడుపుతోంది. వీటిలో శ్రీశైలానికి 781, వేములవాడకు 416, కీసరకు 326 ఉన్నాయి. దీంతో స్పెషల్ బస్సుల్లో టికెట్ రేట్లను సంస్థ 1.5రెట్లు పెంచింది. ఈ నెల 14 నుంచి 16 వరకు ఇది అమల్లో ఉండనుంది. రెగ్యులర్ సర్వీసుల్లో ఎలాంటి మార్పు ఉండదు. స్పెషల్ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో మహిళలకు యథావిధిగా ఫ్రీ జర్నీ అమల్లో ఉంటుంది.