News February 11, 2025
నితీశ్ అలసిపోయారు.. మానసికంగా రిటైరైపోయారు: ప్రశాంత్ కిశోర్

బిహార్ CM నితీశ్ కుమార్పై జనసూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ తాజాగా విమర్శలు గుప్పించారు. ‘ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓ విచిత్రం జరగనుంది. ఎన్డీయే గెలిచినా సరే నితీశ్ మాత్రం ఇక బిహార్ సీఎంగా కొనసాగరు. ఆయన పరిస్థితి బాలేదు. శారీరకంగా అలసి, మానసికంగా రిటైరైపోయారు. కనీసం తన మంత్రుల పేర్లు చెప్పే పరిస్థితిలో కూడా లేరు. బిహార్లో ఆయన ఇప్పుడు బీజేపీకి ఒక ముసుగు మాత్రమే’ అని పేర్కొన్నారు.
Similar News
News December 16, 2025
HB ఇళ్ల పక్క ఉండే 100 గజాల లోపు స్థలాల విక్రయం: పొంగులేటి

TG: హౌసింగ్ బోర్డు ఇళ్లకు పక్కనే ఉన్న 100 గజాల లోపు స్థలాలను అదే ఇంటి యజమానికి విక్రయించవచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. గతంలో ఇంటి కోసం కేటాయించిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి మరో అవకాశమివ్వాలని పేర్కొన్నారు. ‘రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు, వంద గజాల లోపు స్థలాలు అడుగుతున్నవారి వివరాలివ్వండి. క్యాబినెట్లో తుది నిర్ణయం తీసుకుంటాం’ అని HB సమీక్షలో చెప్పారు.
News December 16, 2025
అమ్మాయిలకు మీసాలు.. కారణమిదే

కొంతమంది అమ్మాయిలకు అబ్బాయిల్లా మీసాలు, గడ్డాలు రావడంతో పాటు ముఖంపై ఎక్కువగా వెంట్రుకలు ఉంటాయి. ఈ సమస్యను హిర్సుటిజం(Hirsutism) అంటారు. ఈ సమస్య PCOD, థైరాయిడ్ ఉన్నవారిలో కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మహిళల్లో చాలా తక్కువ మోతాదులో ఉండే మేల్ హార్మోన్స్ పెరగడం, కొన్నిరకాల మందులు వాడటం వల్ల కూడా ముఖంపై వెంట్రుకలు వస్తాయి. సమస్యను గుర్తించగానే వైద్యులను సంప్రదించడం మంచిది. <<-se>>#WomenHealth<<>>
News December 16, 2025
IIIT వడోదరలో ఉద్యోగాలు

IIIT వడోదర 7 ట్రైనింగ్& ప్లేస్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG(మేనేజ్మెంట్/ ఇంజినీరింగ్/LAW), CA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.56,100- రూ.1,77,500 చెల్లిస్తారు. వెబ్సైట్: iiitvadodara.ac.in


