News December 18, 2024
నితీశ్.. కుర్రాడి నుంచి మగాడిగా మారుతున్నాడు: గవాస్కర్

మూడో టెస్టులో నితీశ్ కుమార్ రెడ్డి పరిణతిని క్రికెట్ దిగ్గజం గవాస్కర్ ప్రశంసించారు. ‘తొలి 2 మ్యాచుల్లోనూ అతడికి అటువైపున టెయిలెండర్స్ ఉన్నారు. దాంతో దూకుడుగా ఆడాడు. ఈ మ్యాచ్లో జడేజా ఉన్నాడు కాబట్టి భాగస్వామ్యం కోసం చాలా నియంత్రణతో అద్భుతంగా ఆడాడు. అనవసరమైన షాట్ల జోలికి పోలేదు. 16 పరుగులే చేసినా అందుకోసం 61 బంతుల్ని అడ్డుకున్నాడు. 22 ఏళ్ల ఆ కుర్రాడు ఇప్పుడు మగాడిగా మారుతున్నాడు’ అని కొనియాడారు.
Similar News
News November 26, 2025
పీరియడ్స్లో బ్లాక్ బ్లెడ్ వస్తోందా?

పీరియడ్స్లో కొందరిలో డార్క్ / బ్లాక్ బ్లడ్ డిశ్ఛార్జ్ కనబడుతుంది. అయితే దీనికి కారణం ఆహారం, జీవనశైలిలో చోటు చేసుకున్న మార్పులే అని నిపుణులు చెబుతున్నారు. అలాగే గర్భాశయం నుంచి వచ్చే పాత రక్తం కావొచ్చు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్, గర్భాశయ క్యాన్సర్, టాంపోన్స్, కాపర్ టీ వల్ల కూడా ఇలా కనిపిస్తుంది. ఏదేమైనా పీరియడ్ బ్లడ్లో ఏదైనా అసాధారణంగా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News November 26, 2025
నిరక్షరాస్యుల కోసం ‘అక్షరాంధ్ర’

APలో 15-59 ఏళ్ల వయసున్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు విద్యాశాఖ ‘అక్షరాంధ్ర’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. చదవడం, రాయడంతోపాటు కూడికలు, తీసివేతలను నేర్పిస్తారు. డిజిటల్, ఫైనాన్షియల్, హెల్త్, న్యాయ అంశాలపైనా అవగాహన కల్పిస్తారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లను ఇందుకు వినియోగిస్తారు. ప్రస్తుతం 81L మంది నిరక్షరాస్యులుండగా ఏటా 25L మందికి శిక్షణ ఇవ్వడమే లక్ష్యం.
News November 26, 2025
జిల్లాలు, డివిజన్లు, మండలాల లెక్క ఇదే!

ప్రస్తుతం ఏపీలో 26 జిల్లాలు, 77 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాలు ఉన్నాయి. కొత్తగా మదనపల్లి, మార్కాపురం, పోలవరం జిల్లాలు, నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకశిర, బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు, పెద్దహరివాణం మండలం ఏర్పడతాయి. మార్పులు అమల్లోకి వచ్చిన తర్వాత 29 జిల్లాలు, 82 రెవెన్యూ డివిజన్లు, 680 మండలాలు అవుతాయి.


